Look Out Notice : సజ్జల భార్గవ్ రెడ్డికి లుక్ అవుట్ నోటీస్ జారీ..
Look out Notice : ఆయన విదేశాలకు పారిపోయే అవకాశం ఉండటంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. భార్గవ్ తో పాటు వైసీపీ సోషల్ మీడియా విభాగంలో కీలకమైన అర్జున్ రెడ్డి, మరికొందరిపై కూడా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు
- Author : Sudheer
Date : 12-11-2024 - 9:22 IST
Published By : Hashtagu Telugu Desk
వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జి (YCP Social Media Incharge) సజ్జల భార్గవ రెడ్డి (Sajjala Bhargav Reddy)కి పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. భార్గవ్ పై పులివెందులలో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. సింహాద్రిపురం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్గవరెడ్డి తో పాటు వర్రా రవీందర్ రెడ్డి, అర్జున్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఆ వెంటనే రంగంలోకి దిగి వర్రా రవీంద్రారెడ్డి తో పాటు ఇంటూరి రవికిరణ్ పట్టుకొని వించరించగా.. వాళ్లు ఇచ్చిన వాంగ్మూలాల్లో సజ్జల భార్గవరెడ్డి డబ్బులు ఇచ్చేవారని అందుకే ఆ పోస్టులు పెట్టామని తెలిపారు.
దీంతో పోలీసులు భార్గవ్ ను అరెస్ట్ చేసేందుకు సిద్ధం అయ్యారు. ఆయన విదేశాలకు పారిపోయే అవకాశం ఉండటంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. భార్గవ్ తో పాటు వైసీపీ సోషల్ మీడియా విభాగంలో కీలకమైన అర్జున్ రెడ్డి, మరికొందరిపై కూడా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. వీరి కోసం ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరులోనూ గాలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టులు చేస్తున్న పోలీసులు..వీరికి బెయిల్ కూడా రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు.
వాస్తవానికి సజ్జల భార్గవ్ గత ఎన్నికల్లో వైసీపీ గెలిచినప్పుడు పార్టీలో లేరు. ఆయన బర్మాలో వ్యాపారం చేసుకుంటున్నాడు. అయితే వైసీపీ గెలిచిన తర్వాత కుమారుడ్ని సోషల్ మీడియా ఇంచార్జ్ గా సజ్జల నియమించి, పెద్ద ఎత్తున నిధులు కూడా కేటాయించారు. సోషల్ మీడియా కార్యకర్తలకు ప్రభుత్వ ఖాతాల నుంచి డబ్బులు చెల్లించారు. ప్రభుత్వం ఓడిపోగానే అన్నీ బయటపడతాయన్న ఉద్దేశంతో సజ్జల భార్గవ రెడ్డి సైలెంట్ అయ్యారు..అసలు బయటకూడా కనిపించడం లేదు. దీంతో ఆయనను మొదట్లోనే విదేశాలకు పంపించేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కూడా ఆయన ఇండియాలో లేరని లుకౌట్ నోటీసులు జారీ చేస్తే.. ఏదైనా ఎయిర్ పోర్టులో దిగినప్పుడే తెలుస్తుందని పోలీసులు భావిస్తూ..నోటీసులు జారీ చేసి ఉంటారని అంత మాట్లాడుకుంటున్నారు.
Read Also : Group 2 Mains : ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా.. కొత్త తేదీ ఇదే