Tummala NageswaraRao : కాళేశ్వరం వివాదంపై తుమ్మల ..అబద్ధాల వలన సత్యం మారదు
ఈటల రాజేందర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటల అబద్ధాలు చెప్పారు. ఆయన చెప్పిన మాటల్లో ఎటువంటి వాస్తవం లేదు. కమిషన్ ముందు అలా వాంగ్మూలం ఇచ్చే అవసరం ఏంటో అర్థం కావడం లేదు. ఇది పరిపూర్ణంగా రాజకీయ ప్రేరణతో కూడిన ప్రకటన మాత్రమే అని వ్యాఖ్యానించారు.
- Author : Latha Suma
Date : 07-06-2025 - 5:21 IST
Published By : Hashtagu Telugu Desk
Tummala NageswaraRao : కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం మళ్లీ రాజకీయ వేదికగా మారిన వేళ, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. తనను కావాలనే ఈ వివాదంలోకి లాగుతున్నారని ఆయన ఆరోపించారు. కానీ నిజం ఎప్పుడూ నిజమే. అబద్ధాల ద్వారా దీన్ని మార్చలేరు అని తుమ్మల స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో శనివారం మీడియాతో మాట్లాడిన తుమ్మల, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటల అబద్ధాలు చెప్పారు. ఆయన చెప్పిన మాటల్లో ఎటువంటి వాస్తవం లేదు. కమిషన్ ముందు అలా వాంగ్మూలం ఇచ్చే అవసరం ఏంటో అర్థం కావడం లేదు. ఇది పరిపూర్ణంగా రాజకీయ ప్రేరణతో కూడిన ప్రకటన మాత్రమే అని వ్యాఖ్యానించారు.
Read Also: Chhattisgarh : మరోసారి ఎన్‌కౌంటర్..ఐదుగురు మావోయిస్టులు మృతి
తమ ప్రభుత్వం నియమించిన సబ్ కమిటీకి కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎలాంటి సంబంధం లేదని తుమ్మల స్పష్టం చేశారు. “మేము పెట్టిన సబ్ కమిటీ కేవలం పెండింగ్ ప్రాజెక్టులపై పరిశీలన కోసం మాత్రమే. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎప్పుడూ సబ్ కమిటీ నివేదిక ఇవ్వలేదు. మేడిగడ్డ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిన తర్వాతే కమిషన్‌ను నియమించారు” అని ఆయన వివరించారు. తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తాను స్వచ్ఛందంగా (సుమోటోగా) కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవుతానని తుమ్మల తెలిపారు. “నిజాలను వెల్లడించేందుకు, పూర్తిస్థాయి వివరణ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మేం కేవలం ప్రాణహితపై స్టేటస్ రిపోర్ట్ ఇచ్చాం. అసంపూర్ణ ప్రాజెక్టుల పరిశీలనకే ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కానీ ఈటల చేసిన ప్రకటనలు అవాస్తవాలపై ఆధారపడి ఉన్నాయి” అని అన్నారు.
ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమేనని తుమ్మల విమర్శించారు. “తప్పుడు ప్రకటనలతో ప్రజలను ఎక్కువకాలం మోసం చేయలేరు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో కీలకమైనది. దీనిపై వాస్తవాలను వెల్లడించడం నా బాధ్యత. అందుకే అన్ని వివరాలతో కమిషన్‌కు హాజరవుతాను” అని తుమ్మల పేర్కొన్నారు. ఈ విధంగా తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ నెలకొన్న రాజకీయ దుమారాన్ని మరింత కలిగించాయి. ప్రస్తుతం ఈ అంశం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read Also: Rahul Gandhi : ఫిక్సింగ్ తప్పదు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..