Mission Rayalaseema: రాయలసీమను ఆటోమొబైల్ హబ్ గా మార్చేస్తా: లోకేష్
వచ్చే ఎన్నికలే లక్ష్యంగా యువగలం పేరుతో పాదయాత్ర మొదలు పెట్టిన నారా లోకేష్ ప్రస్తుతం రాయలసీమలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మిషన్ రాయలసీమ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు.
- Author : Praveen Aluthuru
Date : 07-06-2023 - 7:40 IST
Published By : Hashtagu Telugu Desk
Mission Rayalaseema: వచ్చే ఎన్నికలే లక్ష్యంగా యువగలం పేరుతో పాదయాత్ర మొదలు పెట్టిన నారా లోకేష్ ప్రస్తుతం రాయలసీమలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మిషన్ రాయలసీమ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా రాయలసీమలో ఆటో మొబైల్ ఎలక్ట్రానిక్ కంపెనీలను తీసుకొస్తానని చెప్పారు. అందుబాటులో ఉన్న వనరులను వాడుకుంటూ రాయలసీమను అభివృద్ధి చేసే బాధ్యత నాది అంటూ చెప్పారు లోకేష్. చుట్టూ ప్రక్కల ప్రాంతాలైన బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ ఇండస్ట్రీస్ ని ఉపయోగించుకుంటూ రాయలసీమను ఇండస్ట్రియల్ కారిడార్ గా తీర్చి దిద్దుతానని తెలిపారు. రాయలసీమకు పెద్దఎత్తున పరిశ్రమలను తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు నారా లోకేష్.
రాయలసీమను ఇండస్ట్రీయల్ హబ్, హార్టికల్చర్ హబ్, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించి రాయలసీమను దేశంలోనే నంబర్ వన్ గా తీర్చిదిద్దుతాం. వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం. అందుకోసం రీసెర్చ్ సెంటర్లను ప్రవేశపెడతామని లోకేష్ మిషన్ రాయలసీమ కార్యక్రమంలో చెప్పారు.
Read More: Central Cabinet : కేంద్ర కేబినెట్ సమావేశం.. రైతులకు వరాలు.. తీసుకున్న నిర్ణయాలు ఇవే..