Ambedkar Constitution : లోకేష్ ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’ అంటూ అంబటి విమర్శలు
Ambedkar Constitution : రాష్ట్రంలో రాజ్యాంగ వ్యతిరేక పాలన సాగుతోందని , కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పక్కనబెట్టి కక్ష సాధింపు చర్యలకే పరిమితమైందని , లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు
- Author : Sudheer
Date : 26-11-2024 - 3:48 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్(AP)లో అంబేద్కర్ రాజ్యాంగానికి (Ambedkar Constitution) సీఎం చంద్రబాబు (CM Chandrababu)తూట్లు పొడిచారని మండిపడ్డారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యతిరేక పాలన సాగుతోందని , కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పక్కనబెట్టి కక్ష సాధింపు చర్యలకే పరిమితమైందని , లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) అన్నారు. లోకేశ్ చెప్పిన విధంగా పోలీసులు నడుస్తున్నారని , తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎవర్ని పట్టుకురావాలంటే వారిని పోలీసులు పట్టుకురావాలి.. ఎవర్ని లోపల వేయమంటే వాళ్లను లోపల వేయాలన్నట్లుగా నడుస్తోందని విమర్శించారు. ఒక్కొక్క వ్యక్తి మీద ఒకటి రెండు కేసులు కాదు.. 15 కేసులు, 20 కేసులు, 30 కేసులు అని పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాలు తిప్పుతూ హింసిస్తున్నారని మండిపడ్డారు. బహూశా బ్రిటీష్ వారి పరిపాలన చేసే రోజుల్లో కూడా స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిపై ఇన్ని కేసులు పెట్టి ఉంటారని అనుకోవడం లేదని ఎద్దేవా చేశారు. ఈ రెడ్‌బుక్ రాజ్యాంగానికి మరి మనం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని అన్నారు. మన కంటే ముందుగా దాని రచయిత నారా లోకేశ్ ఈ సమాజానికి చెప్పుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం చంద్రబాబు తన రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే రాష్ట్రంలో అమలు చేస్తూ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో జగన్ పాలనలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిందని, ఇంటి వద్దకే సంక్షేమ పాలనతో పాటు సంక్షేమ పథకాలు అందించిన సంగతిని అంబటి గుర్తు చేసారు.
Read Also : Pushpa 2 Runtime : పుష్ప 2 రన్ టైం ..ఎంతో తెలుసా..?