AP: ఏపిలో మూడు రోజులపాటు మద్యం షాపులు బంద్
- By Latha Suma Published Date - 10:37 AM, Wed - 29 May 24
Liquor Shops Closed: ఆంధ్రప్రదేశ్‌లో(AP) జూన్3,4,5, తేదీల్లో మద్యం(alcohol) అమ్మకాలపై నిషేధం(Prohibition) విధిస్తున్నట్లు ఏపి డీజీపీ హరీశ్ గుప్తా(AP DGP Harish Gupta) తెలిపారు. ఏపిలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్(Election Counting) నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు, అల్లర్లు చెలరేగకుండా ముందుజాగ్రత్త చర్యలగా మూడు రోజుల పాటు వైన్స్ షాపులను బంద్ చేయాలిని ఆదేశించింది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలోనే జూన్ 3 నుంచి 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మద్యం షాపులను మూసివేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రాల(counting centers) వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో పాటు ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు డీజీపీ వివరించారు. అదేవిధంగా హోటళ్లు, లాడ్జిలలో తనిఖీలు చేపట్టి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని జిల్లాల సిబ్బందిని ఆదేశించారు. సోషల్ మీడియాపై ఓ కన్నేసి ఉంచాలని, తప్పుడు సమాచారం వ్యాప్తి కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.
Read Also: Cyclone Names : తుఫానులకు పేర్లు ఎవరు పెడతారు ? ‘రెమాల్’ అర్థమేంటి ?
అంతేకాక ఫేక్ పోస్టులు(Fake posts) పెట్టిన వారి ఐపీ అడ్రెస్‌లు తెలుసుకొని, వారికి కాల్ చేసి వార్నింగ్ ఇస్తున్నారు. మళ్లీ మళ్లీ అసత్య ప్రచారాలు చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇలా పోలీసులు అన్ని రకాలుగా ఎన్నికలకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏపీలో జూన్ నెల 4న అటు లోక్‌సభ, ఇటు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. ఇందుకు గంట టైమ్ పడుతుంది. ఆ తర్వాత ఈవీఎంలలో ఓట్లు లెక్కిస్తారు. మధ్యాహ్నం 1 గంట కల్లా.. కౌంటింగ్ పూర్తి చెయ్యాలనే ప్లాన్‌లో అధికారులు ఉన్నారు.