AP : జీవీ హర్షకుమార్ తో లగడపాటి భేటీ ..అసలు ఏంజరగబోతుంది..?
- By Sudheer Published Date - 02:39 PM, Mon - 8 January 24

ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు ఆసక్తిగా మారుతున్నాయి. ఏడాది క్రితం వరకు వైసీపీదే హావ అన్నట్లు అంత అనుకున్నారు కానీ చంద్రబాబు అరెస్ట్ తో అంత మారిపోయింది..అదే క్రమంలో జనసేన టీడీపీకి సపోర్ట్ ఇవ్వడం..బాబు కోసం పవన్ నిలబడడం ఇదంతా ఒక్కసారిగా జనసేన – టీడీపీ గ్రాఫ్ పెరిగేలా చేసింది. ఆ తర్వాత ఎన్నికల పొత్తు ప్రకటించడం..ప్రస్తుతం ఇరు పార్టీలు కలిసే బరిలోకి దిగుతుండడం తో టీడీపీ vs వైసీపీ గా మారింది..ఈ సమయంలో జగన్ మార్పులు చేయడం మొదలుపెట్టడం..వైసీపీ కి తీవ్ర నష్టాన్ని తీసుకొస్తుంది. సర్వేల ఆధారంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకపోయేసరికి వారంతా టీడీపీ , జనసేన లలో చేరుతుండడం తో ఆ రెండు పార్టీల ఫై ఇంకాస్త నమ్మకం పెరుగుతుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఇప్పుడు వైస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి రాబోతుండడం..అది కూడా కాంగ్రెస్ గూటికి చేరడం తో మరింత రసవత్తరంగా మారింది. త్వరలో ఏపీ పగ్గాలు షర్మిల అందుకోబోతుంది. షర్మిల పగ్గాలు అందుకోగానే చాలామంది నేతలు షర్మిల వెంట నడవాలని చూస్తున్నారు. ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నేతలంతా ఇప్పుడు షర్మిల వైపు చూస్తున్నారు. ఈ తరుణంలో విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సోమవారం ..అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ కావడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై వీరిద్దరూ చర్చించినట్టు తెలుస్తోంది. హర్షకుమార్ 2004, 2009లో అమలాపురం లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిథ్యం వహించారు. ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో హర్షకుమార్ తో లగడపాటి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
వీరి కలయిక పట్ల కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వీడిపోయిన తర్వాత లగడపాటి రాజగోపాల్ రాజకీయాలకు దూరమయ్యారు. అప్పటి నుంచి యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు. ఈ పదేళ్లలో చాలా తక్కువగా ఆయన మీడియాలో కనబడ్డారు. వైఎస్ షర్మిల చేరికతో ఏపీ కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగిందన్న ప్రచారం నేపథ్యంలో లగడపాటి బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. మళ్లీ రాజగోపాల్ రాజకీయాల్లోకి రీ ఏంటీ ఇవ్వబోతున్నారా..? షర్మిల అడుగుజాడల్లో నడవబోతున్నారా..? ఈయనతో పాటు మిగతా కాంగ్రెస్ మాజీ నేతలంతా మళ్లీ బయటకు వచ్చి యాక్టివ్ కాబోతున్నారా..? ఇప్పుడు ఇలాగే అంత మాట్లాడుకుంటున్నారు. మరి ఏపీలో ఏంజరుగుతుందో చూడాలి.
Read Also : AP : ఎందుకింత చిన్నచూపు అంటూ జగన్ ఫై..మరో ఎమ్మెల్యే ఆరోపణలు