CM Chandrababu : లడ్డూ వివాదం..సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన సీఎం చంద్రబాబు
CM Chandrababu : సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్టు చేసిన చంద్రబాబు సత్యమేవ జయతే..నమో వేంకటేశాయ అంటూ తన అభిప్రాయం వెల్లడించారు.
- By Latha Suma Published Date - 02:57 PM, Fri - 4 October 24

Supreme Court :తిరుమల శ్రీవారి లడ్డూ ఘటన విచారణ పై సుప్రీం కీలక నిర్ణయం తీసుకుంది. స్వతంత్ర విచారణ కోసం అయిదుగురు సభ్యులతో ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసింది. సీబీఐతో పాటుగా ఏపీ పోలీసులు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. ఈ టీంకు సీబీఐ డైరెక్టర్ నాయకత్వం వహిస్తారు. సుప్రీంకోర్టు నిర్ణయం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. సిట్‌పై వచ్చిన ఆరోపణల్లో నిజం ఉంటే ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. స్వతంత్ర దర్యాప్తు ఉంటేనే.. రాజకీయ జోక్యం ఉండదనేది తమ అభిప్రాయంగా వెల్లడించారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్టు చేసిన చంద్రబాబు సత్యమేవ జయతే..నమో వేంకటేశాయ అంటూ తన అభిప్రాయం వెల్లడించారు.
Read Also: Sanātana Dharma : పవన్ కామెంట్స్ కు డిప్యూటీ సీఎం స్టాలిన్ రియాక్షన్
తిరుమల లడ్డూ వివాదం పైన సుప్రీం కోర్టు సుదీర్ఘ విచారణ చేసింది. లడ్డూ వివాదం పైన స్వతంత్ర సంస్థతో విచారణ చేయించాలని సుబ్రమణ్య స్వామి, వైవీ సుబ్బారెడ్డితో పాటుగా మరి కొందరు సుప్రీంను ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సమయంలో సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం విచారణతో సిట్ విచారణ నిలిపివేసింది. కేంద్రం అభిప్రాయం కోరగా..కేంద్రం పర్యవేక్షణలో విచారణ జరిగాలని కోరుకుంటున్నట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు విన్నవించారు.
దీంతో, సుప్రీంకోర్టు న్యాయస్థానం కొత్తగా సిట్ ఏర్పాటు చేసింది. అందులో సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ ప్రభుత్వం నుంచి ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి ఒకరు సభ్యులుగా ఉంటారు. ఇదే సమయంలో ఎవరూ లడ్డూ వివాదం పైన రాజకీయంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సుప్రీం సూచించింది. సిట్ దర్యాప్తును సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని తీర్పు వెలువరించింది. భక్తుల మనోభావాలకు చెందిన విషయం అయినందున దర్యాప్తు కొనసాగాలని కోరుకుంటున్నట్లు సొలిసిటర్ జనరల్ చెప్పుకొచ్చారు.
Read Also: Actor Mohan Raj Passes Away: అరుదైన వ్యాధితో మలయాళ నటుడు మోహన్ రాజ్(70) మృతి