Kuppam : కుప్పం ఘటనపై గవర్నర్ కు టీడీపీ నేతల ఫిర్యాదు
కుప్పం ఘటనపై విచారణ జరిపించాలని టీడీపీ నేతలు గవర్నర్ ను కలిసి వినతపత్రం అందచేశారు. ఏపీలో అటవిక రాజ్యం నడుస్తోందని ఆందోళన వ్యక్తపరిచారు. `రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా లేకుండా హౌస్ అరెస్టులు చేస్తున్నారు. అన్న క్యాంటీనుపై దాడి చేసి తినే అన్నాన్ని లాగేశారు.
- By Hashtag U Published Date - 01:32 PM, Fri - 26 August 22

కుప్పం ఘటనపై విచారణ జరిపించాలని టీడీపీ నేతలు గవర్నర్ ను కలిసి వినతపత్రం అందచేశారు. ఏపీలో అటవిక రాజ్యం నడుస్తోందని ఆందోళన వ్యక్తపరిచారు. `రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా లేకుండా హౌస్ అరెస్టులు చేస్తున్నారు. అన్న క్యాంటీనుపై దాడి చేసి తినే అన్నాన్ని లాగేశారు. కుప్పం ఘటనపై విచారణ చేయాలి` అంటూ గవర్నర్ ను టీడీపీ నేతలు వేడుకున్నారు. కుప్పంలో వైసీపీ శ్రేణులు వ్యవహరించిన తీరు, అన్న క్యాంటీన్ ధ్వంసం చేయడాన్ని గవర్నర్‌కు వివరించారు. సమావేశం ముగిశాక టీడీపీ నేతలు మీడియాలో మాట్లాడారు. తాము ప్రస్తావించిన అంశాలపై గవర్నర్ స్పందించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంపై గవర్నర్ దృష్టి పెడుతున్నట్లు కనిపించడం లేదని ఆరోపించారు. గవర్నర్‌ను చాలా సందర్భాల్లో కలిశాం.‘‘ఏపీలో ఎస్సీలపై పెరిగిపోతున్న దాడులపై గవర్నరుకు వివరించాం. దళితులపై దాడులు చేయడం పెటెంట్ గా వైసీపీ భావిస్తుందని విమర్శించారు. దళితులకు స్వేచ్ఛగా జీవించే హక్కు లేదు. గవర్నరును చాలా సందర్భాల్లో కలిశాం. ప్రయోజనం ఉండడం లేదు. జగన్ వచ్చినప్పుడల్లా గవర్నరుకు ఏం చెబుతున్నారో..? ఏమో..? ప్రజా సమస్యల పరిష్కారంపై గవర్నర్ ఫోకస్ పెడుతున్నట్టు కన్పించడం లేదని టీడీపీ నేతలు ఆరోపణలకు దిగారు.