Komatireddy : నల్గొండ జిల్లాను బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వ నాశనం చేసింది – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- Author : Sudheer
Date : 11-02-2024 - 5:07 IST
Published By : Hashtagu Telugu Desk
నల్గొండ జిల్లాకు మాజీ సీఎం కేసీఆర్ (KCR) చేసిందేమి లేదని , బీఆర్ఎస్ ప్రభుత్వం నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy). కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయం చేసిందే కేసీఆర్ అని విమర్శించారు. ఈ నెల 13వ తేదీన బీఆర్ఎస్ సభ (BRS Public Meeting in Nalgonda)కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతామని వెంకట్ రెడ్డి ప్రకటించారు.
We’re now on WhatsApp. Click to Join.
కృష్ణా జలాలపై మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్, హరీశ్ రావులకు లేదని , సీఎం జగన్‌ని ఇంటికి పిలిచి చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. జగన్‌తో లాలూచీ పడి, రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని విమర్శించారు. నల్గొండ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పి ఇక్కడికి రావాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు పనికిరాని జగదీశ్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి జిల్లాను నాశనం చేశారు. మునిగిపోయే ప్రాజెక్టులు కట్టి, రూ.లక్షల కోట్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ మాట తప్పడంపై నల్గొండ టౌన్‌లో సభ రోజు వినూత్న నిరసన చేస్తామని తెలిపారు. కేసీఆర్ కోసం చైర్, పింక్ టవల్ ఎల్ఈడి స్క్రిన్ పోలీసు పర్మిషన్‌తో పెడతామని కోమటిరెడ్డి తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ ప్రజాపయోగ్యమైందన్నారు.
Read Also : Balka Suman : ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన ఒక దొంగ ..రేవంత్ – బాల్క సుమన్