Balka Suman : ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన ఒక దొంగ ..రేవంత్ – బాల్క సుమన్
- By Sudheer Published Date - 04:55 PM, Sun - 11 February 24

బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఫై కీలక వ్యాఖ్యలు చేసారు. నాల్గు రోజుల క్రితం సీఎం రేవంత్ ఫై పరుష పదజాలం (Controversial Comments) వాడడం తో ఆయనపై మంచిర్యాల పోలీసులు 294బీ, 504, 506 సెక్షన్ల కింద కేసు రిజిష్టర్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం సుమన్ కు నోటీసులు అందజేశారు. నోటీసులను అందుకున్న సుమన్… వాటిపై సంతకం చేశారు.
కాగా ఈ నోటీసులపై స్పందిస్తూ…మరోసారి రేవంత్ ఫై కీలక వ్యాఖ్యలు చేసారు. రేవంత్ రెడ్డి ఒక క్రిమినల్ అని.. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన ఒక దొంగ అని ఆరోపించారు. నిన్ననే సుప్రీంకోర్టు రేవంత్‌కు ఆ కేసులో నోటీసు కూడా ఇచ్చిందని .. ఆయననే ఒక క్రిమినల్ అయినప్పుడు అతని నుంచి ఇంతకంటే గొప్పగా ఏం ఆశిస్తామని ఎద్దేవా చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అంటే నిర్బంధం, నయవంచన అన్నట్టుగా తయారైందని మండిపడ్డారు. ఈ రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఇప్పటికైనా ఆపేయాలన్నారు. తాను పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేశానని కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడుతోందని.. మరి ఉద్యమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన రేవంత్ కూడా అవే వ్యాఖ్యలు చేశారని చెప్పారు. అలాంటప్పుడు ఆయనపై కూడా కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, తమ పార్టీ నేతలపై పరుష పదజాలం వాడుతున్న కాంగ్రెస్ నేతలపై కూడా కేసులు పెట్టాలన్నారు. కానీ ఇప్పటిదాకా తాము ఎన్ని ఫిర్యాదులు చేసినా కేసు నమోదు చేయడం లేదన్నారు. తమ నేతలపై కాంగ్రెస్ నాయకులు అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ నేతలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Read Also : AP : పొత్తులపై అనుకూలమైన నిర్ణయాలు వస్తాయి – పురంధేశ్వరి