AP Deputy Speaker : ఏపీ కొత్త డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల వీరభద్రస్వామి?
ఏపీ కొత్త డిప్యూటీ స్పీకర్ గా విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి సోమవారం ఎంపికయ్యే అవకాశం ఉంది. సోమవారం నాడు కొత్త డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకొంటారు. ఏపీ బ్రహ్మణ కార్పోరేషన్ చైర్మెన్ గా మల్లాది విష్ణును ప్రభుత్వం నియమించింది.
- Author : CS Rao
Date : 15-09-2022 - 4:51 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ కొత్త డిప్యూటీ స్పీకర్ గా విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి సోమవారం ఎంపికయ్యే అవకాశం ఉంది. సోమవారం నాడు కొత్త డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకొంటారు. ఏపీ బ్రహ్మణ కార్పోరేషన్ చైర్మెన్ గా మల్లాది విష్ణును ప్రభుత్వం నియమించింది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన విష్ణుకు నామినేటేడ్ పదవిని కేటాయించింది. దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన రఘుపతిని డిప్యూటీ స్పీకర్ పదవి నుండి వైదొలిగారు. అధిష్టానం ఆదేశం మేరకు గురువారం అసెంబ్లీ వేదికగా ఆయన రాజీనామా చేశారు. ఆ రాజీనామాను వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదంచారు.
ఆర్యవైశ్య సామాజికవర్గానికి డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వాలని వైసీపీ భావిస్తోందని తెలుస్తోంది. ఆ సామాజికవర్గంపై ఇటీవల జరిగిన దాడులు, మాజీ సీఎం రోశయ్యకు అసెంబ్లీ వేదికగా నివాళులు అర్పించే క్రమంలో జరిగిన తడబాటు ను సరిదిద్దుకునే క్రమంలో ఆ సామాజికవర్గానికి చెందిన కోలగట్ల వీరభద్రస్వామికి పదవి దక్కే అవకాశం ఉందని సమాచారం.