Kodali Nani Health : సర్జరీ సక్సెస్ కానీ కొన్ని రోజులు ICU లో ఉండాల్సిందే !
Kodali Nani Health : సుమారు 10 గంటల పాటు సాగిన ఈ శస్త్రచికిత్స అనంతరం కొడాలి నాని ప్రస్తుతం ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
- By Sudheer Published Date - 07:56 AM, Fri - 4 April 25

మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని (Kodali Nani) గుండె సంబంధిత సమస్యల కారణంగా ముంబైలోని ఏషియన్ హార్ట్‌కేర్ ఇన్‌స్టిట్యూట్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 2న చీఫ్ సర్జన్ రమాకాంత్ పాండా నేతృత్వంలో బైపాస్ సర్జరీ (Bypass Surgery) విజయవంతంగా పూర్తైంది. సుమారు 10 గంటల పాటు సాగిన ఈ శస్త్రచికిత్స అనంతరం కొడాలి నాని ప్రస్తుతం ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, అన్ని అవయవాలు బాగా స్పందిస్తున్నాయని వైద్యులు తెలిపారు. పూర్తిగా కోలుకునేందుకు మరో నెల రోజుల పాటు ముంబైలోనే ఉండాల్సి ఉంటుందని వైసీపీ నేతలు పేర్కొన్నారు.
Waqf Bill : వక్ఫ్ బిల్లుపై జగన్ మౌనం.. కారణం అదే – టీడీపీ
కొడాలి నాని ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన గుడివాడలోని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించారు. విగ్నేశ్వర ఆలయం, విజయదుర్గ దేవాలయంలో నూటొక్క కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. అంతేకాదు CSI చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కొడాలి నాని ప్రజా సేవలో ఇరవై ఏళ్లుగా కీలక భూమిక పోషించారని, ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
KKR vs SRH: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు ఘోర అవమానం.. 80 పరుగుల తేడాతో కోల్‌కతా ఘనవిజయం
గత నెలలో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో గ్రాస్టిక్ సమస్యతో చేరిన కొడాలి నానికి, గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మూడు రక్తనాళాల్లో బ్లాకులు ఉన్నట్లు తేలడంతో వైద్యులు తక్షణం బైపాస్ సర్జరీ చేయాల్సిందిగా సూచించారు. కుటుంబ సభ్యులు వెంటనే నిర్ణయం తీసుకుని కొడాలి నానిని ప్రత్యేక విమానంలో ముంబైకి తరలించారు. ఏషియన్ హార్ట్‌కేర్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడంతో, ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, నేతలు ఆకాంక్షిస్తున్నారు.