Kiran Rayal: రోజాను , అంబటి ని ఓ రేంజ్ లో వేసుకున్న కిరణ్ రాయల్
Kiran Rayal అంబటి రాంబాబుకు చొక్కా లేకుండా అరగంట, గంట ఉండటం అలవాటేనన్నారు. తిరుమల పర్యటన సమయంలో కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చొక్కాకు జగన్ స్టిక్కర్ ధరించి:
- Author : Sudheer
Date : 05-11-2024 - 3:52 IST
Published By : Hashtagu Telugu Desk
జనసేన నేత కిరణ్ రాయల్ (Kiran Rayal)..మరోసారి తన నోటికి పనిచెప్పారు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పై కానీ జనసేన పై కానీ ఎవరైన విమర్శలు చేస్తే ఏమాత్రం తగ్గాడు కిరణ్. అవతలి వ్యక్తి ఎవరైనా సరే దుమ్ముదులిపేస్తాడు. ముఖ్యంగా రోజా (Roja) విషయంలో మరింత దూకుడు చూపిస్తాడు. తాజాగా ఈరోజు అదే పని చేసాడు. నిన్న తిరుమల క్షేత్రంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) జగన్ స్టికర్ తో రావడం , ఇటు రోజా పవన్ కల్యాణ్ , హోంమంత్రి అనిత పై విమర్శలు చేయడం పట్ల కిరణ్ తనదైన స్టయిల్ లో సెటైర్లు వేశారు.
పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రోజా స్పందిస్తూ.. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయాన్ని ప్రశ్నించారు. చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై కిరణ్ రాయల్ స్పందించారు. రోజా వ్యాఖ్యలను జబర్దస్త్ కుర్చీ కామెంట్స్ గా అభివర్ణించారు, రాజీనామా చేయడం అంటే అంత తేలిక కాదని అన్నారు. జనసేన పార్టీ ప్రశ్నించడమే ధ్యేయంగా ఉందని, తమ ఇంటి సమస్యలను తామే పరిష్కరించుకోగలమని అన్నారు. పవన్ చేసిన వ్యాఖ్యల వల్ల కూటమి లోపల ఏదో అయిపోయిందని వైసీపీ ఆనందపడుతోందని, వారు 11 సీట్లకు పరిమితమయ్యినా ఇంకా మారలేదని కిరణ్ రాయల్ విమర్శించారు.
ఆలాగే అంబటి రాంబాబుకు చొక్కా లేకుండా అరగంట, గంట ఉండటం అలవాటేనన్నారు. తిరుమల పర్యటన సమయంలో కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చొక్కాకు జగన్ స్టిక్కర్ ధరించి స్వామి వారిని దర్శించడం అంబటి అహంకారానికి పరాకాష్ట అని , రాంబాబుపై టీటీడీ విజిలెన్స్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదో అర్థం కావడం లేదని, అసలు ఎలా దర్శనానికి అనుమతించారంటూ ప్రశ్నించారు. చొక్కాకు గల స్టిక్కర్ తో తిరుమలకు రావడం కాదు జగన్ ఇంటి చుట్టూ తిరగాలని అంబటికి సూచించారు.
Read Also : Rahul Gandhi : ఇప్పుడు చెయ్యమను తెలంగాణలో రాహుల్ యాత్ర ..? – బండి సంజయ్