HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Bandi Sanjay Saval To Rahul

Rahul Gandhi : ఇప్పుడు చెయ్యమను తెలంగాణలో రాహుల్ యాత్ర ..? – బండి సంజయ్

Rahul Gandhi : రాహుల్ గాంధీ గతంలో భారత్ జోడో యాత్ర చేపట్టినప్పటికీ, ప్రస్తుతం తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై యాత్ర చేయాలంటూ సంజయ్ పేర్కొన్నారు

  • Author : Sudheer Date : 05-11-2024 - 3:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bandi Sanjay
Bandi Sanjay

కాంగ్రెస్ అగ్ర నేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)..హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay)..రాహుల్ కు సవాల్ విసిరారు. ఎన్నికల ముందు కాదు..ఇప్పుడు తెలంగాణ రాహుల్ యాత్ర చేయాలనీ పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ గతంలో భారత్ జోడో యాత్ర చేపట్టినప్పటికీ, ప్రస్తుతం తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై యాత్ర చేయాలంటూ సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణలో అడుగుపెట్టే ముందు ఈ హామీల అమలుపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల సమయంలో రాహుల్.. తెలంగాణ యువత, మహిళలు, రైతులు, అన్ని వర్గాలకు ఆరు గ్యారెంటీలతో పాటు 420 హామీలు ఇచ్చారని, వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారని అన్నారు.
ఈ హామీలను అమలు చేయడం కాదని, కేవలం ప్రచారం కోసమే హామీలు ఇచ్చారని విమర్శించారు. దేశంలో ఎక్కడైనా తిరిగే హక్కు రాహుల్ కు ఉన్నప్పటికీ, రాజకీయ నాయకులు ఇచ్చిన హామీలపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాహుల్ గాంధీ వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ, ఇప్పటికైనా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటె రేపటి నుండి తెలంగాణ కులగణన సర్వే మొదలుకాబోతుంది. ఈ క్రమంలోనే బీసీ జనాభా గణాంకాల సేకరణకు ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచన మేరకు ప్రభుత్వం ఉత్తర్వుల విడుదల చేసింది. బీసీ కులగణనకు డేడికేటెడ్ కమిషన్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కమిషన్ చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ భూసాని వెంకటేశ్వర్ రావును నియమించారు. నెలరోజుల్లో కమిటీ రిపోర్టు సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో బీసీ జనాభా లెక్కలను శాస్త్రీయమైన పద్ధతిలో తేల్చాలని హైకోర్టు సూచించింది. దీని కోసం 2 వారాల్లో డెడికేటెడ్‌ కమిషన్‌ను నియమించాలని అక్టోబర్ 30న ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం వారం రోజుల్లోనే ఈ కమిషన్ ను నియమించింది. డిసెంబర్ 9లోగా బీసీ కులగణన పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.

Read Also : CM Siddaramaiah : కర్ణాటక సీఎంకు హైకోర్టు నోటీసులు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • congress promises in telangana
  • hyderabad
  • rahul gandhi

Related News

Cobra hatchlings at the police station

Hyderabad: పోలీస్ స్టేషన్‌లో నాగుపాము పిల్లలు

న్యాయం కోసం, రక్షణ కోసం ప్రజలు వెళ్లే పోలీస్ స్టేషన్ ఆవరణ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన జోన్‌గా మారిపోయింది. శాంతి, భద్రతలను కాపాడాల్సిన పీఎస్ ప్రాంగణంలోకి ఏకంగా విషసర్పాలు చొరబడుతుండటంతో అటు పోలీసులు, ఇటు సామాన్య జనం బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో తాజాగా చోటుచేసుకున్న ఉదంతం నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. స్టేషన్ ప్రా

    Latest News

    • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

    • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

    • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

    • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

    • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd