Fake Tweets: కేశినేని పేరుతో ట్వీట్ల కలకలం…తనవి కావన్న కేశినేని నాని..!!
సోషల్ మీడియాలో టీడీపీ ఎంపీ కేశినేని నాని పేరుతో ట్వీట్లు కలకలం రేపాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఆ ట్వీట్లు ఉండటంతో అందరి చూపు అటువైపు మళ్లింది.
- Author : hashtagu
Date : 07-08-2022 - 10:11 IST
Published By : Hashtagu Telugu Desk
సోషల్ మీడియాలో టీడీపీ ఎంపీ కేశినేని నాని పేరుతో ట్వీట్లు కలకలం రేపాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఆ ట్వీట్లు ఉండటంతో అందరి చూపు అటువైపు మళ్లింది. సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు ఈ ట్వీట్లు వైరల్ గా మారాయి.
దీనిపై కేశినేని నాని స్పందించారు. సోషల్ మీడియాలో సర్య్కులేట్ అవుతున్న ట్వీట్లు తనవి కావన్నారు. ఫేక్ ట్వీట్లపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు నాని. అటు ఎంపీ కేశినేని కార్యాలయం అవి ఫేక్ ట్వీట్లని వివరణ ఇచ్చింది. వాటిని ఎవరూ నమ్మవద్దంటూ విజ్ఞప్తి చేసింది.