AP Tourism : రోజా సాధించలేనిది..కందుల దుర్గేశ్ సాధిస్తున్నాడు
AP Tourism : టూరిజం శాఖా కు సంబంధించి మంత్రి కందుల దుర్గేశ్ తనదైన మార్క్ కనపరుస్తున్నారు
- By Sudheer Published Date - 05:18 PM, Tue - 28 January 25

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగకపోగా, రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా ఏ మంత్రి కూడా తమ శాఖలను పూర్తిగా అభివృద్ధి చేయకపోగా..ప్రజల చేత ‘ఛీ’ కొట్టించుకున్నారు. కానీ కూటమి సర్కార్ మాత్రం వచ్చిన కొద్దీ నెలల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తుంది. ప్రతి మంత్రి కూడా తమ శాఖకు పూర్తి న్యాయం చేస్తూ..తమ పనితీరుతో శభాష్ అనిపించుకుంటున్నారు. ముఖ్యంగా టూరిజం శాఖా కు సంబంధించి మంత్రి కందుల దుర్గేశ్ తనదైన మార్క్ కనపరుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రాధాన్యతను ఇస్తూ, సీఎం చంద్రబాబు ఇటీవలే ఈ రంగానికి పరిశ్రమ హోదాను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యాటక అభివృద్ధిని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో దుర్గేశ్ నేతృత్వంలో విశాఖపట్నంలో మూడు రోజుల పర్యాటక సదస్సు ప్రారంభమైంది. సోమవారం ప్రారంభమైన ఈ సదస్సు మొదటి రెండు రోజుల్లోనే మంచి ఫలితాలు చూపుతోంది.
Game Changer Result : మొన్న చరణ్..నేడు అంజలి
సదస్సుకు పెద్ద సంఖ్యలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. పర్యాటక శాఖ అందించిన వివరాలు, ప్రోత్సాహక చర్యలు పారిశ్రామికవేత్తలలో విశేష ఆసక్తిని రేకిత్తించాయి. ముఖ్యంగా ఏపీలో పర్యాటక ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ఆరురకు పైగా సంస్థలు ముందుకు వచ్చాయి. ప్రభుత్వం వీటితో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టుల మొత్తం విలువ దాదాపు రూ.1,100 కోట్లుగా ఉంటుందని పర్యాటక శాఖ వెల్లడించింది. ఈ ప్రాజెక్టులు రాజధాని ప్రాంతం నుంచి ఉత్తరాంధ్ర వరకు పర్యాటక అభివృద్ధికి దోహదపడతాయని అధికారులు పేర్కొన్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధి ద్వారా రాష్ట్రానికి అధిక ఆదాయ మార్గాలు ఏర్పడతాయని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది. అభివృద్ధి చెందిన ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్ర యువతకు దాదాపు 2,500 ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. విశాఖపట్నం, అరకు వంటి ప్రాంతాల్లో పర్యాటక కేంద్రాల అభివృద్ధి మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తరువాత రాష్ట్ర పర్యాటక రంగానికి మరింత వృద్ధి కలగనుందని సదస్సు నిర్వాహకులు తెలిపారు. ఇక దుర్గేష్ చేస్తున్న పనితీరు చూసి మాజీ మంత్రి రోజా ఈయనతో కొంతైనా చేసిన బాగుండేది అని గుర్తు చేస్తున్నారు.