HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Kalyan Ram Handed Tdp Flag

TDP : టీడీపీ జెండా పట్టుకొని పార్టీ శ్రేణుల్లో జోష్ నింపిన కళ్యాణ్ రామ్

TDP : ఓ పార్టీ కార్యకర్త అందించిన పసుపు జెండాను కళ్యాణ్ రామ్ పట్టుకుని ఊపడంతో, ఆయన టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారా? అనే చర్చ మొదలైంది.

  • Author : Sudheer Date : 31-03-2025 - 9:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kalyan Ram Tdp Flag
Kalyan Ram Tdp Flag

నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) తెలుగుదేశం పార్టీ (TDP) జెండా పట్టుకోవడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తన తాజా చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి (ArjunSonOfVyjayanthi) ప్రమోషన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన కళ్యాణ్ రామ్ కు నరసరావుపేటలో భారీ స్వాగతం పలికారు. అభిమానులు, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకొని కేరింతలు కొట్టడంతో, నిజమైన ఉత్సవ వాతావరణం కనిపించింది. ఈ క్రమంలోనే ఓ పార్టీ కార్యకర్త అందించిన పసుపు జెండాను కళ్యాణ్ రామ్ పట్టుకుని ఊపడంతో, ఆయన టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారా? అనే చర్చ మొదలైంది.

Bank Holiday: బ్యాంక్ ఖాతాదారుల‌కు అల‌ర్ట్‌.. రేపు బ్యాంకుల‌కు హాలిడే ఉందా?

ఈ సంఘటన నందమూరి , నారా కుటుంబాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయనే అంశంపై కొత్త చర్చకు దారి తీసింది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు అరెస్టైనప్పుడు, నందమూరి కుటుంబంలోని చాలా మంది స్పందించినప్పటికీ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు మౌనం పాటించారని కొన్ని వర్గాలు విమర్శించాయి. అయితే ఇప్పుడు కళ్యాణ్ రామ్ పార్టీ జెండా పట్టుకోవడం, టీడీపీ శ్రేణులకు అభివాదం చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇకపోతే నరసరావుపేటలో పెద్ద ఎత్తున అభిమానులు కళ్యాణ్ రామ్‌కు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం గమనార్హం.

ఈ ఫ్లెక్సీల్లో నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లతో పాటు నారా లోకేష్ ఫోటోలు కూడా ఉండటం విశేషం. ఇది టీడీపీలో నందమూరి కుటుంబం ఐక్యంగా ఉందని ప్రదర్శిస్తున్నట్లు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. గతంలో నారా లోకేష్ కూడా నందమూరి కుటుంబంతో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలో కళ్యాణ్ రామ్ టీడీపీ జెండా పట్టుకోవడం ఆయన భవిష్యత్తు రాజకీయ ప్రస్థానం పై కొత్త ఊహాగానాలకు దారి తీసింది. ఈ ఘటన నందమూరి అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పొచ్చు.

పిలిచి మరి #టీడీపీ జెండా తీసుకున్న Nandamuri Kalyanram అన్న 💛
తాతగారు స్థాపించిన పార్టీని మర్చిపోతారా #నందమూరి కుటుంబం!💥💥💥@NANDAMURIKALYAN #ArjunSonOfVyjayanthi pic.twitter.com/F5JGibvYn5

— sk khasmalli (@khasmalli) March 31, 2025


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ArjunSonOfVyjayanthi
  • kalyan ram
  • Kalyan ram TDP flag
  • tdp

Related News

Atchannaidu Vs Botsa Satyanarayana

బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

Acham Naidu Vs Botsa Satyanarayana  ఏపీ శాసనమండలి సమావేశాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభలోకి విజిల్స్ తీసుకొచ్చిన వైసీపీ సభ్యులు… ఛైర్మన్ పోడియం వద్ద విజిల్స్ వేస్తూ హంగామా సృష్టించారు. ఈ క్రమంలో సభ కాసేపు వాయిదా పడంది. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైసీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందాపూర్ డెయిరీకి, హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

  • TDP candidate Bodepudi Revathi wins in Madhira

    మధిర మున్సిపాలిటీలో టిడిపి పార్టీ అభ్యర్థి భారీ గెలుపు

Latest News

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

  • ల‌వ‌ర్‌తో రొమాంటిక్ ఫొటోను షేర్ చేసిన పాండ్యా!

  • మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ట్రంప్‌!

  • స్పైస్‌జెట్‌కు షాక్ ఇచ్చిన బంగ్లాదేశ్ ప్ర‌భుత్వం!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd