HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ka Paul Said That Pawan Kalyan Life Was Threatened By Chandrababu

KA Paul: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు చంద్ర‌బాబు నుంచి ప్రాణ‌హాని ఉంద‌న్న కేఏ పాల్.. ఎలా అంటే..

ఎన్టీఆర్‌ను మాన‌సికక్షోభ‌కు గురిచేసి చ‌నిపోయేలా చేసిన‌ చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయంకోసం ఏదైనా చేస్తాడ‌ని పాల్ విమ‌ర్శించారు.

  • Author : News Desk Date : 14-06-2023 - 10:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ka Paul
Ka Paul

ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్  (KA Paul) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) కు ప్రాణ‌హాని ఉంద‌ని, అదికూడా చంద్ర‌బాబు (Chandrababu) నుంచే ఉంటుందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. వారాహి యాత్ర‌ (Varahi Yatra) ను ప్రారంభించిన ప‌వ‌న్.. ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించుకోవాల‌ని అన్నారు. అలా ప్ర‌క‌టించుకోకుంటే బీసీలు, కాపులు ప‌వ‌న్ వారాహి యాత్ర‌కు ఎవ‌రూ వెళ్లొద్ద‌ని పాల్ కోరారు. 56శాతం ఉన్న బీసీలు ఒక్క‌సారికూడా ముఖ్య‌మంత్రి కాలేద‌ని అన్నారు. గ‌తంలో చిరంజీవికి కాపులంతా మ‌ద్ద‌తిచ్చార‌ని, కానీ ఓడిపోవ‌టంతో పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశార‌ని గుర్తు చేశారు. కానీ, ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినందుకు చిరంజీవి ఇప్పుడు బాధ‌ప‌డుతున్నాడ‌ని పాల్ అన్నారు.

వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని మ‌రోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకుంటాన‌ని చెబుతూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం స‌రికాద‌ని కేఏ పాల్‌ సూచించారు. చంద్ర‌బాబు, బీజేపీ వ‌ల్లే ఏపీ అభివృద్ధి చెంద‌టం లేద‌ని, అలాంటివారి ప‌క్క‌న ఉండి ప‌వ‌న్ స్వార్థ రాజ‌కీయాలు చేస్తున్న వ్య‌క్తిగా ప్ర‌జ‌ల్లో ముద్ర వేసుకుంటున్నార‌ని, ఇప్ప‌టికైన‌ ప‌వ‌న్ స్వార్థ రాజ‌కీయాలు వ‌దిలివేయాల‌ని పాల్‌ సూచించారు.

ఎన్టీఆర్‌ను మాన‌సికక్షోభ‌కు గురిచేసి చ‌నిపోయేలా చేసిన‌ చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయంకోసం ఏదైనా చేస్తాడ‌ని పాల్ విమ‌ర్శించారు. లోకేష్ ను ముఖ్య‌మంత్రిని చేయ‌డంకోసం చంద్ర‌బాబు ఎంత‌టికైనా తెగిస్తాడ‌ని, ఆ క్ర‌మంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ప్రాణ‌హాని ఉంద‌ని అన్నారు. చంద్ర‌బాబు ప‌వ‌న్‌కు హానిచేసి దానిని జ‌గ‌న్‌మీద నెట్ట‌డం ద్వారా సానుభూతిపొంది గెల‌వాల‌ని చూసినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదంటూ చంద్ర‌బాబుపై పాల్ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh politics
  • chandrababu naidu
  • CM Jagan Mohan Reddy
  • ka paul
  • Pawan Kalyan

Related News

TDP MLA Chadalavada Aravinda Babu

Chandrababu Naidu: టీడీపీ ఎమ్మెల్యే అరవింద బాబు తీరుపై చంద్రబాబు సీరియస్

Chadalavada Aravinda Babu పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే… నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు పల్నాడు ఎస్పీ కార్యాలయంలో దాదాపు 10 గంటల పాటు బైఠాయించడం వివాదానికి కేం

  • Former AP Legislative Council Chairman Shariff

    AP Legislative Council Chairman Sharif: ఏపీ మండలి మాజీ ఛైర్మన్‌ షరీఫ్‌ సంచలన నిజాలు!

  • Jagan

    Ys Jagan Plan B: రాజధానిపై జగన్‌ ప్లాన్‌ బీ.. మావిగన్ పేరుతో తెరపైకి కొత్త ప్రతిపాదన

  • Pawan Kalyan Ustad Bhagat Singh Working stills released from Movie Unit Shootings not stopped with Chandrababu Arrest

    Pawan Kalyan : పవన్ అభిమానులకు ఘోర అవమానం తప్పదా ?

  • Pawan Prakash Raj

    ప్రకాష్ రాజ్ తల్లి మృతి..పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ ..ఇదే కదా పవన్ అంటే !!

Latest News

  • Kriti Sanon Dating : ధోనీ బంధువుతో హీరోయిన్ డేటింగ్?

  • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

  • ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు!

  • హైవేలపై ప్ర‌యాణించేవారికి బిగ్ అల‌ర్ట్.. ఏప్రిల్ 10 నుంచి!

  • ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే ఏమ‌వుతుంది?

Trending News

    • ఒకటి కంటే ఎక్కువ సార్లు వివాహం చేసుకున్న హీరోయిన్స్ వీరే!

    • బీహార్ రాజకీయాల్లో పెను మార్పు.. జాతీయ రాజకీయాల వైపు నితీష్ అడుగులు!

    • అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధం.. 2,076 మంది మృతి!

    • ఉదయనిధి vs కనిమొళి.. డీఎంకేలో వారసత్వ పోరు.. నెక్స్ట్ సీఎం ఎవరు?

    • పంజాబ్ చేతిలో ఓట‌మి.. స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన సీఎస్కే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd