Ap Politics: వేడెక్కుతున్న రాజకీయాలు.. నెక్స్ట్ సీఎం జూనియర్!
ఒంగోలు ప్రధాన కూడలిలో నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్.. ‘అసలోడు వచ్చే వరకూ కొసరోడికి పండగే’ అంటూ ఫ్లెక్సీల ఏర్పాటు చేశారు.
- By Balu J Published Date - 11:58 AM, Tue - 18 July 23
Ap politics: ఒంగోలు ప్రధాన కూడలిలో నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్.. ‘అసలోడు వచ్చే వరకూ కొసరోడికి పండగే’ అంటూ ఫ్లెక్సీల ఏర్పాటు చేశారు. ఓవైపు లోకేష్ యువగళం పాదయాత్ర ప్రకాశం జిల్లాలో జరుగుతున్న సమయంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలంరేపుతోంది. అంతేకాదు ఆ ఫ్లెక్సీలలో పెద్ద ఎన్టీఆర్‌తో పాటు చంద్రబాబు ఫోటోలు కూడా ఉన్నాయి. ఎవరిని ఉద్దేశించి ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారనే చర్చ జరుగుతోంది.
Also Read: Drone Satellite : 5జీ ఇంటర్నెట్ ఇచ్చే డ్రోన్.. 115 అడుగుల రెక్కలతో రయ్ రయ్
వారాహి యాత్ర కు ముందు వారాహి యాత్ర తరువాత అన్నట్లు పవన్ గ్రాఫ్ పెరిగిపోయింది. రాబోయే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా బరిలోకి దిగిన ఆశ్చర్యం లేదు అన్నట్లు ఉంది. జనసేన బలం పెరుగుతుండడం తో అధికార పార్టీ వైస్సార్సీపీ సైతం టిడిపి ని పక్కకు పెట్టి జనసేన పైనే ఫోకస్ చేస్తుంది. ఇదిలా ఉంటె..తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలు లో నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీలు వెలువడం చర్చగా మారింది.