HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jr Ntr Takes Tdp

Jr NTR Enter into TDP Party : Jr.ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేపట్టే టైం వచ్చిందా..?

కేవలం చంద్రబాబునే కాదు ఆయన కుమారుడు లోకేష్ తో పాటు పార్టీ ముఖ్య నేతలను కూడా జైలు కు పంపించే యోచన చేస్తుంది

  • By Sudheer Published Date - 03:45 PM, Mon - 11 September 23
  • daily-hunt
Ntr Tdp
Ntr Tdp

తెలుగుదేశం పార్టీ (TDP).. తెలుగు ప్రజల ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు (NTR) 1982, మార్చి 29న ఈ పార్టీ ని ప్రారంభించాడు. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఉద్దేశ్యంతో టీడీపీ ని స్థాపించాడు. పార్టీ స్థాపించిన తరువాత సన్యాసము పుచ్చుకొని తన జీవితము తెలుగు ప్రజలకు, తెలుగు జాతి ఆత్మగౌరవ పునరుద్ధరణకే తన జీవితము అంకితమని తేల్చి చెప్పాడు.

తన చైతన్య రధంపై రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనతో ఎన్నికల ప్రచారం కొనసాగించారు. అప్పటికే సినిమా రంగంలో సాధించిన అనితరసాధ్యమైన ఆదరణతో ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. తెలుగువారి “ఆత్మగౌరవ” నినాదంతొ, పార్టీ పెట్టిన 9 నెలలలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి తెలుగుదేశం పార్టీ (TDP) అందరినీ ఆశ్చర్యపరచింది. సినిమావాళ్ళకు రాజకీయాలేమి తెలుసన్న అప్పటి ప్రధాని “ఇందిరా గాంధీ” హేళనకు గట్టి జవాబు ఇచ్చారు. అంతే కాదు అప్పట్లో ఉన్న 42 లోక్‌సభ స్థానాలకుగాను 35 స్థానాలను గెలుచుకుని ప్రత్యర్థులను మట్టికరిపించింది. ఆ సంవత్సరం దేశం మొత్తం మీద 544 లోక్‌సభ స్థానాలకుగాను 400 స్థానాలను గెలుచుకున్న కాంగ్రేసు హవా కొనసాగుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో మట్టుకు తెలుగుదేశం విజయం వలన, అప్పటి లోక్‌సభలో కూడా ప్రధాన ప్రతిపక్షమయింది.

1995లో తెలుగుదేశం పార్టీలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు (Chandrababu) కు అధికారం దక్కింది. అప్పటి నుండి 2004వ సంవత్సరం వరకు ముఖ్యమంత్రిగా కొనసాగి, అత్యధిక కాలం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా 9 సం” చరిత్ర సృష్టించారు. 2009 తర్వాత జరిగిన ఉప ఎన్నికలలో తన పార్టీ అభ్యర్థులు గెలవకపోయినా ఆ వెంటనే తిరిగి పుంజుకొని గ్రామస్థాయిలో జరిగిన సర్పంచ్ ఎన్నికలలో అత్యధిక స్థానాలను గెలుచుకొని తిరిగి తన సత్తా చాటారు. ఆ తర్వాత 2014 లో ఏపీ సీఎం గా పదవి దక్కించుకున్నారు. 2019 లో వైసీపీ చేతిలో ఓటమి చెందారు.

Read Also : Another shock to TDP : చంద్రబాబు బయటకు రాకుండా ఏపీ సర్కార్ మరో పిటిషన్..

ఇక ఇప్పుడు అసలు సిసలైన పోరు జరగబోతుందనుకుంటున్న సమయం లో వైసీపీ (YCP) చంద్రబాబు ను అరెస్ట్ (Chandrababu Arrest)చేయించి జైల్లో వేసింది. కేవలం చంద్రబాబునే కాదు ఆయన కుమారుడు లోకేష్ (Lokesh)తో పాటు పార్టీ ముఖ్య నేతలను కూడా జైలు కు పంపించే యోచన చేస్తుంది. ఎన్నికల సమయం నాటికీ టీడీపీ ముఖ్య నేతలందర్నీ జైలు కు పంపించి మళ్లీ అధికారం చేపట్టాలని జగన్ & కో చూస్తుంది. ఇదే జరిగితే టీడీపీ పరిస్థితి ఏంటి అని టీడీపీ కార్యకర్తలు , అభిమానులు మాట్లాడుకుంటున్నారు. టీడీపీ కనుమరుగైనట్లేనా..? టీడీపీ అనేది ఇక ఉండదా..? అని మరికొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా జరగకుండా ఉండాలంటే..Jr ఎన్టీఆర్ టీడీపీ పగ్గం పట్టాల్సిందే అని గట్టిగా చెపుతున్నారు. చంద్రబాబు..లోకోష్..అచ్చెన్నాయుడు ఇలా వీరంతా అరెస్ట్ అయినా..టీడీపీ జెండా కింద పడకుండా ఉండాలంటే జూ. ఎన్టీఆర్ తప్పకుండ టీడీపీ జెండా పట్టుకోవాల్సిందే అని…ఎన్టీఆర్ పట్టుకుంటే జెండా కు ఇక తిరుగులేదని అంటున్నారు.

అభిమానులు ఇలా కోరుకుంటుంటే..ఎన్టీఆర్ (Jr NTR) టీడీపీ పార్టీ జెండా పట్టుకోవడం అనేది అసాధ్యం అని మరికొంతమంది అంటున్నారు. ఎన్టీఆర్ ఇప్పటివరకు చంద్రబాబు అరెస్ట్ ఫై స్పందించలేదు..పార్టీ కార్యక్రమాలకు వచ్చింది లేదు..అంతే ఎందుకు కుటుంబ సభ్యుల వేడుకలకు కూడా కాస్త దూరం దూరంగానే ఉంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లు ఈ ఇద్దరు హీరోలకు సినిమా షూటింగ్ లేకపోయినా, చంద్రబాబు అరెస్టు విషయం తెలిసినా…. స్పందించలేదు. చంద్రబాబుతో ఎన్టీఆర్ కు అంతగా ర్యాపో కుడి రాలేదు. పైగా నందమూరి ఫ్యామిలీలో జరిగే కార్యక్రమాలకు ఎన్టీఆర్ అంతగా హాజరు కావడం లేదు. కుటుంబసభ్యులు ఆహ్వానాలు పంపినా… చాలా సందర్భాల్లో దూరంగా ఉంటున్నారు.

Read Also : BJP Game : రాజ‌కీయ బోనులోప‌డిన చంద్రం.!

ఒక వేళ వెళ్లినా, కార్యక్రమంలో అంటీఅంటనట్టుగా ఉంటూ వస్తున్నారు. రీసెంట్ గా ఢిల్లీలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా… వంద రూపాయల నాణెంను విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి ఆహ్వానం పంపినా ఎన్టీఆర్ వెళ్లలేదు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు, భువనేశ్వరి, పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు. రామక్రిష్ణ ఇతర నందమూరి కుటుంబసభ్యులు వెళ్లారు. అందరూ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. కానీ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ హాజరు కాలేదు. ఇలా ప్రతి వేడుకకు , కార్యక్రమానికి దూరంగానే ఉంటున్నారు. అలాంటిది చంద్రబాబు అరెస్ట్ అయ్యారని..టీడీపీ పార్టీ నేతలు అరెస్ట్ అయ్యారని పార్టీ పగ్గాలు పట్టుకుంటారా..? అని మరికొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి ప్రస్తుతం కేసుల కాలంలో ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు పడితే బాగుంటుందనేది టీడీపీ వీరాభిమానులు కోరిక.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Chandrababu Arrest
  • jr ntr
  • tdp

Related News

Ips Sanjay

IPS Sanjay : ఐపీఎస్ సంజయ్ రిమాండ్ పొడిగింపు

IPS Sanjay : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసు మరోసారి చర్చకు వచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సంజయ్ (IPS Sanjay) రిమాండ్‌ను ఏసీబీ ప్రత్యేక కోర్టు ఈ నెల 31 వరకు పొడిగించింది

  • Star Hotel

    Amaravati Hotels : అమరావతికి స్టార్ హోటళ్ల కళ

  • Cbn Google

    Google : అప్పుడు HYDకు మైక్రోసాఫ్ట్.. ఇప్పుడు విశాఖకు గూగుల్ – చంద్రబాబు

  • Group-1 Candidates

    Bankacherla Project : బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక

  • Fake Alcohol

    Fake Alcohol : నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు యాప్ – చంద్రబాబు

Latest News

  • AP Secretariat Employees : సచివాలయ ఉద్యోగులకు అదనపు బాధ్యతలు

  • BC Bandh in Telangana : దీపావళి వ్యాపారంపై బంద్ ప్రభావం?

  • Gold & Silver Rate Today : ఒకేసారి భారీగా తగ్గిన వెండి ధరలు

  • BC Bandh : BCలను రోడ్డెక్కించిన ‘రాజకీయం’.. కారణమెవరు?

  • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

Trending News

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd