Tadipatri : హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డి
ఈ గ్యాస్ ఎఫెక్ట్ తో జేసీ లంగ్స్ ఇన్ఫెక్షన్ కు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలించి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు
- By Sudheer Published Date - 03:18 PM, Wed - 15 May 24

ఏపీలో ఎన్నికలు (AP Elections) కాస్త ప్రశాంతగానే ముగిసాయి అని అంత అనుకున్నారో లేదో..పోలింగ్ రోజును మించిన దాడులు ఇప్పుడు జరుగుతున్నాయి. నిన్నటి నుండి అనేక జిల్లాలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు. టీడీపీ నేతలపై , కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. ఇంట్లో ఆడవారి ఫై కూడా దాడులు చేస్తూ నానా బీబత్సం సృష్టిస్తున్నారు. ఈ దాడుల నేపథ్యంలో ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పుడు ఎలాంటి దాడి జరుగుతుందో..? ఎటునుండి వచ్చి దాడి చేస్తారో..? అని భయపడుతున్నారు. ఈ దాడుల నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నప్పటికీ..కొంతమంది మాత్రం ఏమాత్రం భయపడకుండా పోలీసుల ముందే దాడులకు పాల్పడుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
నిన్న తాడిపత్రి (Tadipatri )లో టీడీపీ , వైసిపి వర్గీయుల మధ్య ఘర్షణ రాళ్ల దాడికి దారి తీయగా, ఈ దాడిలో ఇరు వర్గాలకు చెందిన ఇద్దరు గాయపడటంతో పాటు, పోలీసులు కూడా గాయపడ్డారు. ఎస్పీ వాహనాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. నిన్న జరిగిన ఈ ఘటనలో సీఐ మురళీకృష్ణ కు గాయాలయ్యాయి. ఈ దాడికి నిరసనగా జేసీ ప్రభాకర్ రెడ్డి ధర్నాకు దిగారు. తర్వాత ఆయన వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి వైపు కార్యకర్తలతో వెళుతుండగా వైసీపీ శ్రేణులు అక్కడికి భారీగా చేరుకున్నాయి. ఈ క్రమంలో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. ఈ గ్యాస్ ఎఫెక్ట్ తో జేసీ లంగ్స్ ఇన్ఫెక్షన్ కు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలించి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తాడిపత్రిలో ఎప్పుడు ఏంజరుగుతుందో అని పార్టీ శ్రేణులతో పాటు , పోలీసులు ఖంగారు పడుతున్నారు.
Read Also : RR vs PBKS: బట్లర్ లేకుండానే బరిలోకి.. రాజస్థాన్ రాయల్స్ లో మైనస్ అదే