Roja vs Janasena : చిత్తూరు చిత్రాంగి అంటూ రోజా పై జనసేన రివెంజ్ స్టార్ట్
Roja vs Janasena : ‘చిత్తూరు చిత్రాంగి’ అంటూ రోజా మీద వ్యక్తిగత స్థాయిలో విమర్శలు చేశారు
- By Sudheer Published Date - 04:19 PM, Fri - 18 April 25

తిరుమల గోశాల వివాదం (Tirumala cowshed controversy) రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతోంది. గోవుల మరణాల అంశంపై వైసీపీ-టీడీపీ (YCP -TDP) మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా, తాజాగా మాజీ మంత్రి ఆర్కే రోజా (Roja) వ్యవహారంలోకి వచ్చి పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడడం ద్వంద్వ తత్వమేనంటూ, గోశాల ఘటనపై ఆయన తీరు పట్ల ప్రశ్నలు సంధించారు. తిరుమల విషయంలో పరోక్షంగా శాపగ్రస్తుడు అన్నట్లుగా మాట్లాడటం చర్చనీయాంశమైంది.
Aprilia Tuono 457 : తిరుపతిలో అందుబాటులోకి వచ్చిన అప్రిలియా టుయోనో 457
ఈ వ్యాఖ్యలు జనసేన శ్రేణుల్లో ఆగ్రహం నింపాయి. జనసేన సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ, కార్పొరేటర్ మూర్తి యాదవ్‌లు ఘాటుగా స్పందించారు. భూమన కరుణాకర్‌రెడ్డి గతంలో హారతి డ్రామా చేసినట్లే ఇప్పుడు గోవులపై డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రోజా గతంలో టికెట్లు బ్లాక్‌లో అమ్మి డబ్బులు సంపాదించారని, ఇప్పుడు ఆ లాభం ఆగిపోవడంతో తిరుమలపై అసత్య ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. ఆమె మాటలకు సరిపడే స్థాయిలో గట్టిగా విమర్శలు చేయడం జనసేన రివెంజ్ స్టార్ట్ అయినట్లు స్పష్టం చేస్తోంది.
మూర్తి యాదవ్ అయితే మరింత దూకుడుగా స్పందించారు. రోజా తన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఆమెను విశాఖలో అడుగుపెట్టనివ్వమని సవాల్ చేశారు. వైసీపీ హయాంలో తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ‘చిత్తూరు చిత్రాంగి’ అంటూ రోజా మీద వ్యక్తిగత స్థాయిలో విమర్శలు చేశారు. రోజా గతంలో నటించిన కొన్ని చిత్రాలను ప్రస్తావిస్తూ, ఆమె తిరుమలలో ప్రమాణం చేయగలరా అని సవాల్ విసిరారు. ఈ విమర్శలతో చిత్తూరు రాజకీయాల్లో రగడ ముదురుతోంది. రానున్న రోజుల్లో ఈ వ్యవహారం ఏ మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.