HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Janasena Graph Down

AP : కార్యకర్తల్లో జనసేన ఫై నమ్మకం పోయిందా..? గ్రాఫ్ పూర్తిగా తగ్గడానికి కారణం పవనేనా..?

  • Author : Sudheer Date : 12-03-2024 - 1:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jansena (1)
Jansena (1)

జనసేన పార్టీ (Janasena Party)..నిన్న , మొన్న పుట్టిన పార్టీ కాదు..దాదాపు పదేళ్ల క్రితం ప్రజల్లోకి వచ్చిన పార్టీ. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్థాపించిన ఈ పార్టీ..మొదట్లో చరిత్ర తిరగరాస్తుందని..అంత భావించారు. కానీ ఆ చరిత్రను పవన్ తిరగరాయలేకపోయారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ఏపీ కి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి సీఎం అయితే బాగుంటుందని చెప్పి..2014 (2014 AP Elections) లో చంద్రబాబు కు మద్దతు ఇచ్చి టిడిపి అధికారంలోకి వచ్చేలా చేసాడు పవన్. ఆ తర్వాత చంద్రబాబు తో ఏర్పడిన విభేదాల కారణంగా కూటమి నుండి బయటకు వచ్చారు. ఆ తరువాత ఎప్పటిలాగానే సినిమాలు చేస్తూ..ప్రజలకు దూరమయ్యారు.

మళ్లీ 2019 (2019 AP Elections)ఎన్నికలలో సింగిల్ గా పోటీ చేసాడు. కానీ పార్టీ సింగిల్ స్థానం మాత్రమే కైవసం చేసుకుంది. కనీసం ఆయన నిల్చున్న రెండు చోట్లలో ఒక్క చోట కూడా గెల్చుకోలేకపోయాడు. అయినప్పటికీ నిరాశ పడకుండా తన రాజకీయ ప్రయాణం కొనసాగించారు. కాకపోతే ఈసారి ప్రజల్లో ఎక్కువగా ఉండడం..కౌలు రైతు కోసం సాయం చేస్తూ ఉండడం తో ప్రజల్లో జనసేన ఫై నమ్మకం పెరుగుతూ వచ్చింది. గత ఎన్నికల్లో సింగిల్ కే పరిమితం చేసాం కదా..ఈసారి సీఎం ను చేయాల్సిందే అని అభిమానులు , పార్టీ శ్రేణులు , ప్రజలు సైతం భావించారు. జనసేన గ్రాఫ్ సైతం పెరుగుతూ వచ్చింది. ఈ సమయంలోనే టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) కావడం..పవన్ కళ్యాణ్ ను సైతం అధికార పార్టీ వైసీపీ పలు అంటకాలకు గురి చేయడం ఆయన సినిమాలకు టికెట్ల రేట్లు తగ్గించడం ఇలా అనేక ఘటనలు చోటుచేసుకోవడం తో పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోసారి టిడిపి తో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యి..రాజమండ్రి జైలు సాక్షిగా పొత్తు ప్రకటించాడు. ఇదే పవన్ చేసిన తప్పు.

అప్పటివరకు జనసేన కు జై కొట్టిన జనసేన శ్రేణులు , నేతలు టిడిపి తో పొత్తు అనేసరికి నిరాశ , ఆగ్రహానికి గురయ్యారు. గతంలో చంద్రబాబు తో విభేదించి మళ్లీ ఆయనతో జత కట్టడం ఏంటి అని ప్రశ్నించారు. కొంతమంది పార్టీ కి రాజీనామా చేసి వైసీపీ లో చేరగా..ఇంకొంతమంది పొత్తు ఎలా ఉండబోతుందో చూద్దాం అంటూ ఎదురుచూసారు. పొత్తు అంటే చేరి సమానంగా ఉంటాయి కదా అని అనుకున్నారు. కానీ పవన్ మాత్రం కేవలం 23 సీట్లు మాత్రమే తెచ్చుకొని , ఇవి చాలు మన గెలుపుకు..ఈ 23 సీట్లు విజయం సాధిస్తే అదే పెద్ద విజయం అని..టిడిపి పార్టీ కి ఉన్న క్యాడర్ జనసేన కు లేదని అందుకే 23 సీట్లు తీసుకున్నాం అన్నట్లు ఎప్పుడు చెప్పే నీతి సూత్రాలే చెప్పుకొచ్చారు. దీని తర్వాత పార్టీ లో ఆగ్రహపు జ్వాలలు ఎగసిపడ్డాయి. అప్పటి వరకు పవన్ కు జై కొట్టిన వారంతా ఛీ కొట్టడం స్టార్ట్ చేసారు. ఆ 23 మాత్రం ఎందుకు టిడిపి లోనే కలిస్తే పోతుంది కదా..సపరేట్ గా జనసేన ఎందుకు అని ఎదురుతిరిగారు. అధికార పార్టీ వైసీపీ సైతం పవన్ 23 సీట్లు తీసుకోవడం ఫై పెద్ద ఎత్తునే విమర్శలు , సెటైర్లు వేసింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఇప్పుడు బిజెపి (BJP) పొత్తు కోసం ఢిల్లీ కి వెళ్లి..23 ను కాస్త 21 కి తీసుకొచ్చి పార్టీ శ్రేణుల్లో మరింత ఆగ్రహం నింపారు. నిన్నటి నుండి అభిమానులు , కార్యకర్తలు రగిలిపోతున్నారు. వైసీపీ చేస్తున్న విమర్శలకు ఏ సమాధానం చెప్పాలో కూడా వారికీ తెలియడం లేదు. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ వెంట నడిచిన పార్టీ కీలక నేతలు సైతం..పవన్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల కాస్త ఆగ్రహంగానే ఉన్నారు. ఇక కొత్తగా పార్టీ లో చేరిన నేతలు సైతం చేరి తప్పు చేశామా..? అనే కోణంలో ఆలోచిస్తున్నారు. జగన్ ను ఓడించాలంటే పార్టీని పణంగా పెట్టాలా? సీట్లను తగ్గించుకుని తనకు తానే రాజకీయంగా ఇబ్బందులు జనసేనాని కొని తెచ్చుకుంటున్నారా? చంద్రబాబు పెట్టిన ప్రతిపాదనలకు అంతా తలూపాల్సిన పనేంటి? ఎవరి అవసరం ఎవరికి ఉంది? జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడం పవన్ కల్యాణ్ కు ఎంత ముఖ్యమో.. చంద్రబాబుకు అంతకన్నా ఎక్కువ అవసరం కదా..? అని ప్రశ్నింస్తున్నారు.

ఇదే క్రమంలో సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ ను త్యాగరాజు అంటూ సెటైర్లు వేసుకుంటూ ఓ రేంజ్ లో ఆడేసుకుంటుంటారు ట్రోలర్స్ . మొత్తం మీద పవన్ ఏమనుకొని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో కానీ ప్రస్తుతం మాత్రం రాష్ట్రంలో జనసేన గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని అంటున్నారు. మొన్నటి వరకు కాస్తో కూస్తో నమ్మకం ఉండేది కానీ ఇప్పుడు అదికూడా లేదని జనసైనికులే చెపుతున్నారు. ఎన్నికలకు పట్టుమని రెండు నెలలు కూడా లేదు. ఇలాంటి సమయంలో ఏ పార్టీ అధినేత అయినా ప్రచారం చేయడం..ప్రతి రోజు మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం కార్యకర్తల్లో జోష్ నింపడం..ప్రజలకు తమ పార్టీ అధికారంలోకి వస్తే కలిగే లాభాల గురించి చెప్పడం చేస్తారు..కానీ పవన్ మాత్రం పొత్తుకు ప్రాకులాడుడే సరిపోతుంది తప్ప ..ప్రజల్లో పొత్తుకు సపోర్ట్ చేస్తారా అసలు అనేది ఏమాత్రం ఆలోచించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికి పవన్ రాజకీయాల్లో సెట్ అవ్వడు అని మరోసారి రుజువైందని కామెంట్స్ చేస్తున్నారు.

Read Also : Haryana Alliance Ends: సాయంత్రం 4 గంటలకు మనోహర్ లాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Janasena
  • janasena graph in AP
  • Pawan Kalyan
  • tdp

Related News

Pawan Lokesh Frd

ఇది కదా స్నేహమంటే !! పవన్ గురించి చెపుతూ నారా లోకేశ్ ఎమోషనల్

చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు, యావత్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళనలో ఉన్న తరుణంలో, పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి లోకేష్‌కు ధైర్యం చెప్పడం ఆ బంధాన్ని మరింత ధృడపరిచింది. "అంతా బాగున్నప్పుడు అందరూ పలకరిస్తారు, కానీ కష్టకాలంలో తోడు నిలిచేవారే నిజమైన స్నేహితులు" అని లోకేష్ పేర్కొనడం గమనార్హం.

  • Pawan Kalyan Adopts Two Gir

    అంజనాదేవి పుట్టిన రోజు సందర్బంగా పవన్ దత్తత

  • Pawan is a person who thinks about two or three generations: Nagababu

    నాగబాబు కు కీలక బాధ్యతలు అప్పగించిన కూటమి సర్కార్

  • Arava Sridhar Janasena Mla

    రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై జనసేన జనసేన అధిష్టానం సీరియస్‌

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్

Latest News

  • జనవరిలో రికార్డు స్థాయి వాహన అమ్మకాలు

  • ఇంట్లో దేవతా విగ్రహాలు ఎంత ఎత్తు ఉండాలి?

  • ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు..ఇప్పుడు ఎందుకు తగ్గుతున్నాయి ?

  • అంబటి, జోగి కుటుంబాలను పరామర్శించనున్న జగన్ ! గుంటూరు లో ఏంజరుగుతుందో ?

  • 2025 లో మన దేశంలో మొత్తం ఎన్ని విమాన ప్రమాదాలు జరిగాయో తెలుసా ?

Trending News

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

    • పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

    • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd