Point of Contact : జనసేన-టీడీపీ పొత్తు కార్యాచరణలో మరో ముందడుగు
టీడీపీతో జనసేన సమావేశాలు, ఇరు పార్టీలు ఉమ్మడిగా నిర్వహించే కార్యక్రమాలను సమన్వయ పరచడం వీరి విధి. రేపటి నుంచి మూడ్రోజుల పాటు రాష్ట్రంలో జనసేన-టీడీపీ ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నారు
- By Sudheer Published Date - 07:23 PM, Mon - 13 November 23

ఏపీలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ తో కలిసి జనసేన (TDP -Janasena) బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరు పార్టీలు కలిసి తమ కార్యాచరణ చేస్తున్నాయి. ఇప్పటికే ఇరు పార్టీలు కలిసి సమన్వేయ కమిటీ ఏర్పాటు చేయగా..తాజాగా జనసేన-టీడీపీ పొత్తు కార్యాచరణలో మరో ముందడుగు పడింది. ఇరు పార్టీల మధ్య నియోజకవర్గ స్థాయిలో చేపట్టే సమావేశాలు, ఉమ్మడి కార్యక్రమాల నిర్వహణకు జనసేన తరఫున ఇన్చార్జులను నియమించారు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).
We’re now on WhatsApp. Click to Join.
ఈ ఇన్చార్జిలను ‘పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ( Point of Contact)’ లుగా పరిగణిస్తారు. టీడీపీతో జనసేన సమావేశాలు, ఇరు పార్టీలు ఉమ్మడిగా నిర్వహించే కార్యక్రమాలను సమన్వయ పరచడం వీరి విధి. రేపటి నుంచి మూడ్రోజుల పాటు రాష్ట్రంలో జనసేన-టీడీపీ ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నారు. జనసేన-టీడీపీ సమన్వయ కమిటీ నిర్ణయించిన అజెండా మేరకు పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో ఏంచేయాలన్నది తాజాగా నియమితులైన ఇన్చార్జిలు ఆత్మీయ సమావేశాల్లో వివరించనున్నారు. ప్రజలను కలిసి భవిష్యత్తుకు గ్యారెంటీపై వివరించడం, ఓటరు జాబితాల పరిశీలన తదితర అంశాలను విజయవంతం చేయడం వీరి బాధ్యత.
నియోజకవర్గాల వారీగా తెలుగుదేశం పార్టీతో సమావేశాల నిర్వహణ, సంప్రదింపుల సమన్వయ బాధ్యుల జాబితా pic.twitter.com/HAgaGJxU7I
— JanaSena Party (@JanaSenaParty) November 13, 2023
Read Also : Hyderabad: నాంపల్లిలో కాంగ్రెస్, ఎంఐఎం నేతల మధ్య వాగ్వాదం