Hyderabad: నాంపల్లిలో కాంగ్రెస్, ఎంఐఎం నేతల మధ్య వాగ్వాదం
నాంపల్లిలో అగ్నిప్రమాదం ఘటనా స్థలంలో కాంగ్రెస్, ఎంఐఎం మద్దతుదారుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్‌ఖాన్ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించగా స్థానిక ఎంఐఎం కార్యకర్తలు అడ్డుకున్నారు.
- By Praveen Aluthuru Published Date - 06:25 PM, Mon - 13 November 23

Hyderabad: నాంపల్లిలో అగ్నిప్రమాదం ఘటనా స్థలంలో కాంగ్రెస్, ఎంఐఎం మద్దతుదారుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్‌ఖాన్ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించగా స్థానిక ఎంఐఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్, ఎంఐఎం కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాలను చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని ఫిరోజ్ ఖాన్ ఆరోపించారు.
నాంపల్లి బజార్‌ఘాట్‌లోని హిమాలయ హోటల్ ఎదురుగా ఉన్న నాలుగు అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో ఈరోజు ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో గ్యారేజ్ ఉండడంతో కారు మరమ్మతులు చేస్తుండగా మంటలు చెలరేగాయి. అదే సమయంలో అక్కడ డీజిల్, కెమికల్ డ్రమ్ములు ఉండడంతో మంటలు చెలరేగడంతో ప్రమాదం పెరిగింది. అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read: Khammam Politics: పువ్వాడ ఎన్నికల అఫిడవిట్ పై ఈసీకి తుమ్మల ఫిర్యాదు