AP : పవన్ విశాఖ నుంచి వెళ్లిపో!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను విశాఖ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు కోరారు. విశాఖలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
- By hashtagu Published Date - 01:42 PM, Sun - 16 October 22
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను విశాఖ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు కోరారు. విశాఖలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ బస చేసిన నోవాటెల్ హెటల్లో పోలీసులు ఈ విషయం గురించి చర్చించారు. కాగా ఇవాళ నిర్వహించాల్సిన జనవాణి కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే.
కాగా ఉత్తరాంధ్రకు చెందిన పార్టీనేతలతో సమావేశం…జనవాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు పవన్ కల్యాణ్ శనివారం విశాఖ వచ్చారు. మూడు రాజధానులకు మద్దతుగా జేఏసీ ఆధ్వర్యంలో విశాఖగర్జన జరిగింది. ఈ సమయంలోనే విశాఖకు వచ్చిన మంత్రులపై జనసేన కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో తమకు ఎలాంటి సంబంధం లేదని జనసేన ప్రకటించింది. ఎయిర్ పోర్టు నుంచి నోవాటెల్ వస్తుండగా పోలీసులు వ్యవహరించిన తీరుపై జనసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులకు సహకరించాలని జనసేన నేతలు గుర్తు చేయగా…ఇవాళ ఉదయం నుంచి పోలీసులు జనసేన నేతలతో చర్చిస్తున్నారు. విశాఖలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పవన్ విశాఖను వదిలి వెళ్లాలని పోలీసులు కోరుతున్నారు.