Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు అస్వస్థత.. వారాహి యాత్రకు స్మాల్ బ్రేక్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ సమావేశాలు, సభలతో బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే.
- Author : Hashtag U
Date : 27-06-2023 - 12:07 IST
Published By : Hashtagu Telugu Desk
సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ సమావేశాలు, సభలతో బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. గతకొద్ది రోజులుగా వరుసగా సభలు నిర్వహిస్తూ రాజకీయ క్షేత్రంలో బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే భీమవరంలో వారాహి యాత్రలో ఉన్న పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. నిరాహార దీక్ష చేయడంతో ఆయన నీరసంగా ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ఉదయం జరగాల్సిన పార్టీ నేతల సమావేశం రద్దయింది. దీంతో జనసేన అభిమానులు, నాయకులు ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు అస్వస్థత కారణంగా వారాహి యాత్రకు కొంత అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.
ఇటీవల బహిరంగ సభలో పాల్గొన్న పవన్ వైద్యరంగంలోని లోపాలను ఎత్తిచూపారు. సమాజంలో వ్యవస్థ పట్ల విసిగిపోయి జనసేన పార్టీ పెట్టానని పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. తానెప్పుడు గొంతెత్తినా అది అణగారిన వర్గాల కోసమే అయి ఉంటుందని చెప్పారు. రాజకీయాల్లో జవాబుదారీతనం ఉండాలన్నారు. ఏపీ ప్రజల కోసం ఆరోగ్యశ్రీ మించిన పాలసీ తీసుకువస్తానని ఆయన చెప్పారు.
Also Read: Telangana Leader: తెలంగాణ తొలితరం నేత సోలిపేట కన్నుమూత