Pawan Die Hard Fans: అభిమాని కోరిక నెరవేర్చిన పవన్
పవన్ కళ్యాన్ ఓ జనసైనికుడి కోరిక నెరవేర్చి మరోసారి వార్తల్లో నిలిచారు. ఏపీలోని కాకినాడ జిల్లా పెదపూడి మండలం రామేశ్వరానికి చెందిన
- By Balu J Published Date - 11:33 AM, Mon - 31 October 22

పవన్ కళ్యాన్ ఓ జనసైనికుడి కోరిక నెరవేర్చి మరోసారి వార్తల్లో నిలిచారు. ఏపీలోని కాకినాడ జిల్లా పెదపూడి మండలం రామేశ్వరానికి చెందిన సత్తిబాబు పవన్‌కల్యాణ్ వీరాభిమాని. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తగా పనిచేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం ఆయనకు క్యాన్సర్ సోకడంతో కాకినాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో వైద్యం చేయించుకున్నారు. తన అభిమాన హీరో, నాయకుడైన పవన్ కల్యాణ్‌తో ఫొటో తీసుకోవడానికి కాకినాడ నుంచి అంబులెన్స్‌లో మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. పవన్ కల్యాణ్ సత్తిబాబుతో మాట్లాడి ఫొటో దిగి అభిమాని కోరికను తీర్చారు.
ఆకులో ఆకునై..
భీమవరం జిల్లా తుందుర్రుకు చెందిన నాగేంద్రసాద్ కొబ్బరిమట్టల ఆకులను కత్తిరించి అంబేడ్కర్, పవన్‌కల్యాణ్, చేగవేరా, జనసేన ఆకృతులను తయారు చేశారు. మంగళగిరిలో పవన్‌కల్యాణ్‌కు చూపించడానికి దీన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం పై రెండు ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.