Lokam Madhavi Assets: జనసేన అభ్యర్థి లోకం మాధవి ఆస్తి 894 కోట్లా..?
ఉమ్మడి విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన అభ్యర్థి లోకం మాధవి. తాజాగా ఆమె ఆస్తి వివరాలను వెల్లడించారు. అయితే జనసేన అభ్యర్థి ఆస్తిని చూసి పలువురు షాక్ అవుతున్నారు. ఏకంగా చంద్రబాబుతో సమానంగా ఆమె ఆస్తి ఉండటంతో హాట్ టాపిక్ గా మారింది.
- Author : Praveen Aluthuru
Date : 20-04-2024 - 6:48 IST
Published By : Hashtagu Telugu Desk
Lokam Madhavi Assets: ఏపీలో ఎన్నికల హడావుడా తారాస్థాయికి చేరుకుంది. ఓవైపు ఎన్నికల ప్రచారం, మరోవైపు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. రేపు చంద్రబాబు తమ అభ్యర్థులకు బీఫారాలు ఇవ్వనున్నారు. అటు జనసేన అధినేత ఇప్పటికే తమ 21 మంది అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు. తాజాగా బీఫారం తీసుకున్నారు ఉమ్మడి విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన అభ్యర్థి లోకం మాధవి. తాజాగా ఆమె ఆస్తి వివరాలను వెల్లడించారు. అయితే జనసేన అభ్యర్థి ఆస్తిని చూసి పలువురు షాక్ అవుతున్నారు. ఏకంగా చంద్రబాబుతో సమానంగా ఆమె ఆస్తి ఉండటంతో హాట్ టాపిక్ గా మారింది.
లోకం మాధవి రూ.894 కోట్ల ఆస్తులను వెల్లడించారు. తనకు మిరాకిల్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉందని వెల్లడించారు. దీనికి తోడు విద్యాసంస్థలు, భూములు, నగదు, బ్యాంకు డిపాజిట్ల రూపంలో ఆస్తులు ఉన్నాయని మాధవి తన అఫిడవిట్‌లో తెలిపారు. తన వద్ద బ్యాంకులో రూ.4.41 కోట్లు, లిక్విడ్ క్యాష్ రూ.1.15 లక్షలు ఉన్నాయని మాధవి తెలిపారు. చరాస్తుల విలువ రూ. 856.57 కోట్లు కాగా స్థిర ఆస్తులు రూ. 15.70 కోట్లుగా అఫిడవిట్ లో పొందుపరిచారు. అయితే తనకు 2.69 కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join
ఏప్రిల్ 19న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే చంద్రబాబు తరుపున నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 23నా పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయనున్నారు.
Also Read: Harish Shankar : ప్రెస్ నోట్‌తో చిరంజీవి మూవీ కెమెరామెన్‌కి.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన హరీష్ శంకర్..