HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jagans Very Existence Is Anarchy He Is Well Versed In The Politics Of The Axe

జగన్ బతుకే ఒక అరాచకం.. గొడ్డలి రాజకీయాలు తెలుసు : మంత్రి కొల్లు రవీంద్ర

  • Author : Vamsi Chowdary Korata Date : 16-04-2026 - 2:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kollu Ravindra fir on ys jagan
Kollu Ravindra fir on ysjagan

వైసీపీ అధినేత జగన్ నిన్న జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో స్పందించారు. జగన్ బతుకే ఒక అరాచకమని, ఆయనకు అభివృద్ధి చేయడం తెలియదని, గొడ్డలి రాజకీయమే తెలుసని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుండటాన్ని చూసి ఓర్వలేకే జగన్ కులాల మధ్య చిచ్చుపెట్టి అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. గురువారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ విషయంలో జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని రవీంద్ర మండిపడ్డారు. “ఐదేళ్ల పాటు నిధులు, బిల్లులు ఇవ్వకుండా హార్బర్ నిర్మాణాన్ని అడ్డుకుని, మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీసింది జగన్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు వేగవంతం చేసి, 901 మీటర్ల జెట్టీ, కోల్డ్ స్టోరేజ్‌లతో ఆధునిక హార్బర్‌గా పూర్తి చేస్తుంటే.. మత్స్యకారులను రెచ్చగొట్టేలా అసత్యాలు మాట్లాడుతున్నారు” అని విమర్శించారు.

దేశ రక్షణ సంస్థపై జగన్ వైఖరి దుర్మార్గం

జువ్వలదిన్నెలో దేశ రక్షణకు కీలకమైన ‘సాగర్ డిఫెన్స్’ సంస్థకు కేంద్ర అనుమతితో భూమి కేటాయిస్తే, దానిని తరిమికొడతాననడం జగన్ దుర్మార్గపు ఆలోచనకు నిదర్శనమని కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “తల్లి, చెల్లిని వెళ్లగొట్టారు, సొంత బాబాయినే వేసేశారు. ఇప్పుడు దేశ రక్షణ సంస్థను కూడా తరిమికొడతానంటున్నారు. అంటే జగన్‌కు దేశం మీద కూడా భక్తి లేదు. ఆయనకు తెలిసింది గొడ్డలి పార్టీ, గొడ్డలి గుర్తు.. నరుక్కుంటూ పోవడమే” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

అభివృద్ధి, పెట్టుబడులకు జగన్ శత్రువు

గత ఐదేళ్లలో 800 పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమికొట్టిన చరిత్ర జగన్‌దని రవీంద్ర ఆరోపించారు. “కియా, అమరరాజా వంటి సంస్థలను బెదిరించి పొరుగు రాష్ట్రాలకు పంపారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వస్తుంటే చూసి ఓర్వలేకపోతున్నారు. నేను వస్తే చట్టాలు మార్చేస్తానంటూ పెట్టుబడిదారులను మళ్లీ భయపెట్టాలని చూస్తున్నారు. విధ్వంసమే నైజంగా ఉన్న జగన్‌ను ప్రజలు నమ్మకే 11 సీట్లకు పరిమితం చేశారు” అని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, జీవో 217ను రద్దు చేసి, వేట నిషేధ భృతిని పెంచి, వారికి అండగా నిలుస్తోందని మంత్రి స్పష్టం చేశారు.

తమిళనాడు బోట్ల విడుదల అంశంలో జగన్ దుష్ప్రచారం

తమిళనాడు మత్స్యకారుల బోట్లను పట్టుకున్న తర్వాత, వాటిని యువనేత నారా లోకేశ్ చెప్పడం వల్లే పోలీసులు విడుదల చేశారని జగన్ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం, దురదృష్టకరం అని కొల్లు రవీంద్ర కొట్టిపడేశారు. ఈ అంశాన్ని రాజకీయంగా మార్చి లబ్ది పొందాలని జగన్ ప్రయత్నించడం బాధాకరమని అన్నారు.

వాస్తవానికి, ఈ బోట్ల విషయంలో స్థానిక గ్రామాల ప్రజలు జోక్యం చేసుకున్నారని వెల్లడించారు. “ఇది మా గ్రామాల మధ్య ఉన్న సమస్య. మేమే చర్చించుకుని పరిష్కరించుకుంటాం” అని వారు కోరారని తెలిపారు. వారి అభిప్రాయాన్ని, ఐక్యతను గౌరవిస్తూ, వారి నిర్ణయం ప్రకారమే మేము ముందుకు వెళ్లాం… అంతేకానీ, ఇందులో లోకేశ్ గారి ప్రమేయం ఉందనడం పచ్చి అబద్ధం అని కొల్లు రవీంద్ర వివరించారు.

నిజానికి, సముద్ర గస్తీ విషయంలో గత జగన్ ప్రభుత్వ హయాంలోనే తీవ్ర నిర్లక్ష్యం జరిగింది. 2017 వరకు ఇతర రాష్ట్రాల బోట్లు రాకుండా మెరైన్ బోట్లు గస్తీ కాస్తుండేవి. కానీ 2019 తర్వాత ఆ గస్తీ పూర్తిగా నిలిచిపోయింది. బోట్ల రిపేర్లు, మెయింటెనెన్స్‌కు నిధులు ఇవ్వకపోవడం, సిబ్బందిని తొలగించడం వంటి చర్యలతో సముద్ర సరిహద్దులు బలహీనపడ్డాయి. ఆ కారణంగానే తమిళనాడు బోట్లు మన సముద్ర జలాల్లోకి చొరబడి మత్స్య సంపదను దోచుకుపోయే పరిస్థితి ఏర్పడింది.

ఈ పరిస్థితిని గుర్తించిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేశ్ గారు అధికారులను అప్రమత్తం చేశారు. తక్షణమే 650 హార్స్ పవర్ ఇంజిన్లతో కూడిన స్పీడ్ బోట్లను ఏర్పాటు చేసి గస్తీని పటిష్టం చేశాం. అక్రమంగా ప్రవేశిస్తున్న బోట్లను నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాం. వాస్తవాలు ఇలా ఉంటే, జగన్ మాత్రం నిజాన్ని దాచిపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు” అని కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh politics
  • Fisheries Harbor
  • Former CM YS Jaganmohan Reddy
  • Minister Kollu Ravindra
  • Tamil Nadu Boats
  • YSR Congress Party

Related News

Chandrababu Naidu

Chandrababu Naidu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

చిత్తూరు జిల్లా కండ్రిగలో జరిగిన సంజీవని ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 11 విషయాలు చెబుతానంటూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన 11 అరాచక, విధ్వంసకర ఘటనలను ఏకరువు పెట్టారు. ఈ నిర్వాకాల వల్లే వైసీపీని తాను ‘గొడ్డలి పార్టీ’ అని పిలుస్తున్నానని, ఆ పార్టీ ముమ్మాటికీ గొడ్డలి పార్టీనేనని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్

  • Let Us Make Mahanadu a Success: Minister Nara Lokesh

    Nara Lokesh: మహానాడును విజయవంతం చేద్దాం : మంత్రి నారా లోకేశ్‌

  • Janasena MLA Arava Sridhar Resigns from Whip Post

    Arava Sridhar: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విప్ పదవికి రాజీనామా

Latest News

  • Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

  • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

  • Land Scam : హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

  • AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

  • Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd