Jagan Mohan Reddy : ప్రజల్ని ఇంకా పీడిస్తున్న జగన్ ‘అవినీతి’
Jagan Corruption : మంచి పాలనను జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి విషతుల్యం చేశాడు. కేవలం తన స్వార్ధం కోసం జగన్ రెడ్డి అప్పటికే ఉన్న పవర్ పర్చేజ్ ఎగ్రిమెంట్లను రద్దు చేశాడు
- By Sudheer Published Date - 04:23 PM, Mon - 4 November 24

ఒక అసమర్థుడు రాష్ట్రాన్ని పాలిస్తే ఏదోలే అని సరిపెట్టుకోవచ్చు. అదే ఒక క్రిమినల్ రాష్ట్రాన్ని పాలిస్తే….? ప్రజలకు ఎనలేని నష్టం కలుగుతుంది. ప్రకృతి వనరులు దోపిడికి గురి అవుతాయి. ప్రజాధనం లూఠీ అవుతుంది. విద్యుత్ రంగంలో కూడా ఇదే జరిగింది. 2018 జనవరి నాటికి విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు (Chandrababu) తీర్చిదిద్దగా గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి (Jagan) రాష్ట్ర విద్యుత్ రంగాన్ని తన స్వార్ధం కోసం తీర్చలేని నష్టాల్లోకి నెట్టాడు.
2014 నుంచి 2019 వరకూ శ్రీ చంద్రబాబునాయుడు రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను (Electricity charges) ఒక్క రూపాయి కూడా పెంచకుండా అద్భుతంగా పరిపాలించారు. తలసరి విద్యుత్ వినియోగం 1,003 యూనిట్ల నుంచి 1,234 యూనిట్లకు ఆ కాలంలో పెరిగింది. మంచి పాలనను జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి విషతుల్యం చేశాడు. కేవలం తన స్వార్ధం కోసం జగన్ రెడ్డి అప్పటికే ఉన్న పవర్ పర్చేజ్ ఎగ్రిమెంట్లను రద్దు చేశాడు. దీనివల్ల రూ.500 కోట్లు నష్టం వాటిల్లింది. డిస్కమ్ ల బకాయిలు పెరిగిపోవడంతో 9 వేల కోట్ల రూపాయలు అప్పు చేశాడు.
హిందూజా ప్రాజెక్టు ను షెడ్యూలు చేయకపోవడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూ.1,235 కోట్లు ఫిక్స్ డ్ కాస్టును ఆ కంపెనీకి చెల్లించాల్సి వచ్చింది. కృష్ణపట్నం 2వ దశ, విటిపిఎస్ 5వ దశ, పోలవరం జలవిద్యుత్ కేంద్రం పూర్తి చేయలేకపోవడం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లింది. జగన్ రెడ్డి హయాంలో తన అసమర్థత కారణంగా 2,560 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోయాడు. తన అసమర్థత కారణంగా విద్యుత్ రంగంలో అప్పులు పెరిగిపోయాయి. క్యాష్ ఫ్లో కూడా లేకపోవడంతో ఎక్కువ వడ్డీకి అప్పులు తెచ్చాడు.
రాష్ట్రంలో విపరీతంగా విద్యుత్ కోతలు అమలు చేశాడు. విద్యుత్ కోతలు, విద్యుత్ చార్జీల భారీ పెంపుదల కారణంగా రాష్ట్రంలోని ప్రజలు ఇబ్బంది పడటమే కాకుండా పారిశ్రామిక ఉత్పత్తి తగ్గిపోయింది. విద్యుత్ రంగంలో ఇన్ని దారుణాలు చేసిన జగన్ రెడ్డి, ఎన్నికల ముందు ప్రజలతో నాటకాలు ఆడాడు. తాను ఎక్కువ ధరకు విద్యుత్ కొనడం కారణంగా ఏర్పడిన లోటును భర్తీ చేసుకోవడానికి చార్జీలు మళ్లీ పెంచేందుకు ప్రతిపాదనలను ఈఆర్సీ కి సమర్పించాడు.
ఎన్నికలు వచ్చాయని, ఇప్పుడు చార్జీలు పెంచితే ఓట్లు రావని ఈఆర్సీని బతిమిలాడుకుని విద్యుత్ చార్జీల పెంపును వాయిదా వేయించాడు. కారణాలు ఏమిటో తెలియదు కానీ ఈ ఏడాది మార్చి 1వ తేదీన ఈఆర్సీ చార్జీల పెంపు ఆదేశాలు ఇవ్వాల్సి ఉండగా అక్టోబర్ 25న తన తీర్పును వెల్లడించింది. వాస్తవానికి ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ ఎడ్జెస్ట్ మెంట్ (FPPCA) చార్జీల సవరణ క్లాజును ఏనాడో తీసివేయగా జగన్ రెడ్డి 2021 జులై 2వ తేదీన మళ్లీ రాష్ట్రంలో ప్రవేశపెట్టాడు.
జగన్ రెడ్డి తన స్వార్ధం కోసం ఎక్కువ ధర పెట్టి విద్యుత్ కొనుగోలు చేసినందువల్ల 2022 నుంచి 2023 వరకూ అంటే ఒక్క ఏడాది లోనే రూ.8113 కోట్ల మేరకు నష్టం వచ్చిందని డిస్కమ్ లు ఈఆర్సీ కి తెలిపాయి.
ఎన్నికల ముందు ఎప్పుడో తీర్పు ఇవ్వాల్సిన ఏపీఈఆర్సీ తాజాగా తీర్పు ఇచ్చింది. రాబోయే 15 నెలల్లో రూ.6,072 కోట్లు FPPCA వసూలు చేసుకోవచ్చునని ఏపీఈఆర్సీ తీర్పునిచ్చింది. 15 నెలల పాటు అదనపు చార్జీలు వసూలు చేసుకునే విధంగా తీర్పులో పేర్కొన్నారు.
గతంలో చంద్రబాబునాయుడు చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను తన స్వార్ధం కోసం రద్దు చేసుకున్న జగన్ రెడ్డి మొత్తం 8,394 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను అధికధరలకు కొన్నాడు. స్వార్ధ ప్రయోజనాల కోసం జగన్ రెడ్డి చేసిన ఈ కొనుగోలు కారణంగా రూ.6,522 కోట్లు అదనపు భారం పడింది. ఇప్పుడు ఈఆర్సీ రూ.6,073 కోట్ల FPPCA వసూలు చేసేందుకు అనుమతించింది జగన్ రెడ్డి చేసిన తప్పిదం వల్ల పడిన భారాన్ని భర్తీ చేసుకోవడానికే. ఈ రూ.6,073 కోట్లలో మొత్తం రూ.1,400 కోట్ల మేరకు కూటమి ప్రభుత్వం భరించేందుకు సిద్ధంగా ఉంది.
ఈ రూ.1,400 కోట్లు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, పేద వర్గాలకు చెందిన వారి విద్యుత్ చార్జీలకు సంబంధించిన FPPCA. జగన్ రెడ్డి చేసిన తప్పుల కారణంగా రూ.4,673 కోట్లు విద్యుత్ వినియోగదారుల నుంచి FPPCA రూపంలో వసూలు చేయాల్సి వస్తున్నది. గతంలో శ్రీ చంద్రబాబునాయుడు చేసిన పిపిఏ లను కొనసాగించి ఉన్నా…. ఆయన చేపట్టిన విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను పూర్తి చేసి ఉన్నా స్వల్పకాలిక ఒప్పందాలతో విద్యుత్ కొనుగోలు చేసే అవసరం వచ్చేది కాదు. అయితే ఏ మాత్రం దూరదృష్టి లేని, స్వార్ధపూరిత మనిషి అయిన జగన్ రెడ్డి శ్రీ చంద్రబాబు చేసిన పిపిఏలను రద్దు చేసి, కొత్తగా స్వల్పకాలిక ఒప్పందాలు చేసుకోవడం వల్ల తీరనినష్టం వాటిల్లింది. రాజకీయాలకు పనికి రాని ఒక స్వార్థపరుడిని, ఒక క్రిమినల్ ని ప్రజలు నమ్మి ఒక్క ఛాన్సు ఇవ్వడం వల్ల విద్యుత్ రంగంలో కలిగిన నష్టం ఇది.
Read Also : TTD : ‘వక్ఫ్ బోర్డు’ రియల్ ఎస్టేట్ కంపెనీ.. ఒవైసీ వ్యాఖ్యలకు టీటీడీ చీఫ్ కౌంటర్