HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jagans Arrival In Tirumala Will Create Tension

Jagan : తిరుమలకు జగన్ రాక..ఏంజరుగుతుందో టెన్షన్..?

Jagan : తిరుమల పర్యటనలో ఆటంకాల్ని సృష్టిస్తూ భక్తుల ముసుగులో ఆయ‌న‌పై దాడికి భానుప్రకాశ్ రెడ్డి (బీజేపీ), కిరణ్ రాయల్ (జ‌నసేన‌), టీడీపీ నేతలు డబ్బులిచ్చి గూండాలని పురిగొల్పుతున్నట్లు తమకు సమాచారం

  • Author : Sudheer Date : 27-09-2024 - 2:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagan Tpt
Jagan Tpt

మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ తిరుమల టూర్ టెన్షన్ పెడుతుంది. తిరుమల లడ్డూ(Tirumala Laddu)లో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందంటూ వివాదం సాగుతున్న క్రమంలో మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ (Jagan) తిరుమల సందర్శనకు వస్తుండడం ఏంజరుగుతుందో అనే ఆందోళన నడుస్తుంది. తిరుమల పవిత్రతకు చంద్రబాబు భంగం కలిగించారని.. ఆయన చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఈ నెల 27న సాయంత్రం మెట్ల మార్గంలో తిరుమలకు వెళ్తున్నట్లు జగన్ ప్రకటించారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా విడుదల చేసారు. ఈరోజు సాయంత్రం రేణుగుంట కు వచ్చి..అక్కడి నుండి తిరుపతికి చేరుకొని మెట్ల మార్గం ద్వారా కొండపైకి వెళ్లనున్నారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.

ఈ తరుణంలో వైసీపీ కీలక ఆరోపణ చేసింది. తిరుపతి లో జగన్ ఫై దాడికి కుట్ర జరుగుతోందని వైసీపీ సంచలన ట్వీట్ చేసింది. శ్రీవారి దర్శనార్థం ఈరోజు సాయంత్రం తిరుమలకి జగన్ వెళ్ల‌నున్నారు. ఈ క్రమంలో తిరుమల పర్యటనలో ఆటంకాల్ని సృష్టిస్తూ భక్తుల ముసుగులో ఆయ‌న‌పై దాడికి భానుప్రకాశ్ రెడ్డి (బీజేపీ), కిరణ్ రాయల్ (జ‌నసేన‌), టీడీపీ నేతలు డబ్బులిచ్చి గూండాలని పురిగొల్పుతున్నట్లు తమకు సమాచారం అందినట్లు వైసీపీ త‌న ట్వీట్‌లో పేర్కొంది. జగన్ వ్యతిరేకంగా నినాదాలు చేయడానికి, వాహన శ్రేణిపై గుడ్లు వేసేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో మనుషుల్ని పురమాయించినట్లు తెలుస్తోందని పేర్కొంది. తిరుమలలో జ‌గ‌న్‌ పర్యటనతో లడ్డు ఇష్యూలో నీ బండారం బయటపడుతుందని భయపడుతున్నావా చంద్ర‌బాబు? అంటూ వైసీపీ ప్ర‌శ్నించింది. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైర‌ల్ అవుతోంది.

మరోపక్క తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేసిందని విమర్శించారు. జగన్‌ తిరుమల రాకను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే అర్హత జగన్‌కు లేదని తెలిపారు. జగన్‌ పర్యటనను నిరసిస్తూ ప్లకార్డులతో శాంతియుతంగా నిరసన తెలుపుతామని ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ప్రధాన కూడళ్లలో బ్యానర్లు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఐదేళ్లలో ఆలయాలను అపవిత్రం చేశారని విమర్శించారు. కాగా, తిరుపతిలో సేవ్‌ తిరుమల.. సేవ్‌ టీటీడీ సమావేశం జరిగింది. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు స్వామీజీలు డిమాండ్‌ చేశారు. మరోపక్క వైసీపీ శ్రేణులు సైతం పెద్ద ఎత్తున తిరుపతి కి చేరుకుంటున్నారు. జగన్ కు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా ఇరు పార్టీలు పెద్ద ఎత్తున నువ్వా..నేనా అంటూ సై అంటుండడం తో ఏంజరుగుతుందో అనే టెన్షన్ పెరుగుతుంది.

Read Also : Saif Ali Khan : ఆయన ఎంతో ధైర్యవంతుడైన రాజకీయ నాయకుడు: సైఫ్‌ అలీఖాన్‌


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Jagan Tirumala Visit
  • ys jagan

Related News

Mavigun

జ‌గ‌న్ ‘మావిగన్’.. ఈ ఐడియా ఇచ్చింది ఎవ‌రంటే?!

జగన్ ఇతరుల నుండి సలహాలు, ఆలోచనలు తీసుకుంటే ఇప్పుడున్న స్థాయి నాయకుడు అయ్యేవారు కాదు. జ‌గ‌న్‌ ఎప్పుడూ తన స్వశక్తితో స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికే ఇష్టపడతారు.

  • Chandrababu Naidu

    Cm Chandrababu Naidu: చరిత్ర నిన్ను క్షమించదు జగన్: చంద్రబాబు

  • Vijayasai Reddy about amaravati

    Vijaya Sai Reddy: అమరావతిపై మరోసారి నోరు పారేసుకున్న విజయసాయిరెడ్డి

  • Vishnu Kumar Raju

    Political Satire: జగన్ పై విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు

  • Former AP Legislative Council Chairman Shariff

    AP Legislative Council Chairman Sharif: ఏపీ మండలి మాజీ ఛైర్మన్‌ షరీఫ్‌ సంచలన నిజాలు!

Latest News

  • క‌రోనా కొత్త వేరియంట్‌.. చిన్న పిల్ల‌ల‌పై ప్ర‌భావం?

  • ఈసీ విష‌యంలో విప‌క్షాల‌కు బిగ్ షాక్‌..!

  • Cricket : ఒక్క రన్ ప్రాణం పోయేలా చేసింది !!

  • Telangana Govt School : ప్రభుత్వ స్కూల్స్ లలో యూకేజీ తరగతులు

  • Telangana Govt : తెలంగాణ విద్యార్థులకు రేవంత్ సర్కార్ గొప్ప శుభవార్త

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd