CM Jagan : నూతన ఇంటికి ముహూర్తం ఫిక్స్ చేసిన సీఎం జగన్
అక్టోబర్ 24 నుంచి సీఎం జగన్ వైజాగ్ క్యాంప్ ఆఫీస్ నుంచి పాలన కొనసాగించనున్నారు. విశాఖపట్నం-భీమిలి బీచ్ రోడ్డులోని.. రుషికొండపై ఏపీ టూరిజం శాఖ శ్రద్ధ పెట్టి కడుతున్న కాంప్లెక్స్‌లోనే సీఎం నివాసం ఉండబోతున్నారు
- By Sudheer Published Date - 03:31 PM, Sun - 1 October 23
విశాఖ లోని నూతన ఇంటికి సీఎం జగన్ (CM Jagan) వెళ్లబోతున్నారు. దీనికి సంబదించిన ముహూర్తం ఫిక్స్ చేసారు. దసరా పర్వదినాన తాడేపల్లి నుంచి విశాఖ కు జగన్ షిఫ్ట్ కాబోతున్నారు. విశాఖ నుండి పరిపాలన అందించబోతున్నట్లు ఇప్పటికే సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబదించిన పనులు కూడా మొదలుపెట్టారు. అక్టోబర్ 24 నుంచి సీఎం జగన్ వైజాగ్ క్యాంప్ ఆఫీస్ నుంచి పాలన కొనసాగించనున్నారు. విశాఖపట్నం-భీమిలి బీచ్ రోడ్డులోని.. రుషికొండపై ఏపీ టూరిజం శాఖ శ్రద్ధ పెట్టి కడుతున్న కాంప్లెక్స్‌లోనే సీఎం నివాసం ఉండబోతున్నారు.
సీఎం మాత్రమే కాదు.. అనుబంధ శాఖలకు సంబందించిన ఉన్నతాధికారులంతా ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం దీనికి సంబదించిన పనులను కార్పొరేషన్ ఏండీ కన్నబాబు (kannababu) చూసుకుంటున్నారు. తరుచు విశాఖలో పర్యటిస్తూ.. అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ DEC ఆధ్వర్యంలో పనులు వేగంగా, నాణ్యతాప్రమాణాలతో జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థతుల్లోనూ అక్టోబర్ 23 దసరా నాటికి సీఎం గృహ ప్రవేశం జరగాలన్నది నిర్ణయంగా తెలుస్తుంది.
Read Also : Shock To Hafiz Saeed : ‘లష్కరే’ చీఫ్ హఫీజ్ సయీద్ కు షాక్.. సన్నిహితుడి మర్డర్