Nara Lokesh: జగన్ ని చూస్తే జబర్దస్త్ బిల్డప్ బాబాయి గుర్తుకొస్తాడు
జగన్ ని చూస్తే జబర్దస్త్ బిల్డప్ బాబాయి గుర్తుకొస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు టీడీపీ నేత నారా లోకేష్. జగన్మోహన్ రెడ్డి మాటలు నిశితంగా గమనిస్తే మనకు జబర్దస్త్ బిల్డప్ బాబాయ్ గుర్తుకొస్తారు.
- By Praveen Aluthuru Published Date - 06:29 PM, Sat - 23 December 23

Nara Lokesh: జగన్ ని చూస్తే జబర్దస్త్ బిల్డప్ బాబాయి గుర్తుకొస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు టీడీపీ నేత నారా లోకేష్. జగన్మోహన్ రెడ్డి మాటలు నిశితంగా గమనిస్తే మనకు జబర్దస్త్ బిల్డప్ బాబాయ్ గుర్తుకొస్తారు. ఆయన మాటలు కోటలు దాటగలవు, చేష్టలు గడప కూడా దాటలేవని విమర్శించారు. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తానని చెప్పిన ఆయన శంకుస్థాపన చేసి నాలుగేళ్లు అయిందన్నారు. కోట్లు విలువ చేసే ఉక్కు కర్మాగారం నిర్మాణం చేపడతామని చెప్పడంపై లోకేష్ నిప్పులు చెరిగారు.
ప్లాంట్ నిర్మాణాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టాల్సి ఉండగా తుప్పు తొలగింపునకు కూడా నిధులు కేటాయించకపోవడంతో తొలి ఒప్పందం చేసుకున్న లిబర్టీ స్టీల్స్ పారిపోయిందని చెప్పారు. దీంతో ఏడాది క్రితం జేఎస్ డబ్ల్యూ పేరుతో మరో సంస్థను స్థాపించారు. మరో మూడు నెలల్లో పదవీకాలం ముగియనున్నప్పటికీ కడప స్టీల్ ప్లాంట్ పనులు ఒక్క అంగుళం కూడా ముందుకు సాగలేదు. పులివెందులులో రోడ్ల నిర్మాణానికి బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్ పరారీ అయ్యాడు. ఇంత దివాళా తీసిన ముఖ్యమంత్రిని నమ్మి వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఎవరైనా ముందుకు వస్తారా అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.
Also Read: Shah Rukh Khan: డంకీ అనే పేరు పెట్టడం చాలా సంతోషాన్నిచ్చింది : షారుక్