Jagan Speech : జగన్ ఇక మారవా..?
ఐదేళ్లలో ప్రభుత్వం అందజేసిన పథకాలు గురించి ఊకదంపుడు ఉపన్యాసమే ఇచ్చారు తప్ప రాబోయే ఐదేళ్లు తాము ఏమి చేస్తామన్నది ఎక్కడ ప్రస్తావించలేదు. విపక్షాల ధీటుగా తమ మేనిఫెస్టో ఉందని చెప్పలేకపోయాడు
- By Sudheer Published Date - 07:06 PM, Thu - 9 May 24

ఏపీలో మరో మూడు రోజుల్లో ప్రచారానికి ముంగిపు పడబోతోంది. ఉన్న ఈ కొద్దీ సమయాన్ని గట్టిగా వాడుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు భావిస్తాయి. ప్రత్యర్థి అభ్యర్థులను తమ మాటలతో..విమర్శలతో ఉక్కిరి బిక్కిరి చేయాలనీ చూస్తారు. కానీ ఈ విషయంలో జగన్ మాత్రం ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. నిన్న ప్రచారానికి గ్యాప్ తీసుకున్న జగన్..ఈరోజు అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో పాల్గొన్నారు. ప్రచారానికి కొద్దీ సమయం మాత్రమే ఉంది..కాబట్టి ఈరోజు జగన్ తన స్పీచ్ తో అదరగొడతాడని..కూటమి నేతలపై విరుచుకపడతాడని అంత అనుకున్నారు..కానీ జగన్ మాత్రంపాత చింతకాయ పచ్చడి మాదిరే అదే స్క్రిప్ట్ చదివి నిరాశ పరిచాడు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రచారం మొదలుపెట్టిన రోజు నుండి చెపుతున్న ముచ్చటే చెప్పుకొచ్చారు. అవ్వ..అయ్యా..అన్న ..చెల్లెమ్మ అంటూ ఐదేళ్లలో ప్రభుత్వం అందజేసిన పథకాలు గురించి ఊకదంపుడు ఉపన్యాసమే ఇచ్చారు తప్ప రాబోయే ఐదేళ్లు తాము ఏమి చేస్తామన్నది ఎక్కడ ప్రస్తావించలేదు. విపక్షాల ధీటుగా తమ మేనిఫెస్టో ఉందని చెప్పలేకపోయాడు. అదే చంద్రబాబు..అదే దత్తపుత్రుడు అంటూ ఎప్పటి తీరు ఉపన్యాసమే ఇచ్చాడు. దీంతో అక్కడికి వచ్చిన కార్యకర్తలంతా అబ్బే అనుకుంటూ వెనుతిరిగారు. ఓ పక్క కూటమి అధినేతలు ఓ రేంజ్ లో స్పీచ్ ఇస్తూ..భారీ భారీ డైలాగ్స్ పేలుస్తూ చెమటలు పట్టిస్తుంటే..మన జగనన్న మాత్రం రొటీన్ డైలాగ్స్ తో బోరు కొట్టిస్తున్నాడని వాపోతున్నారు. మరి రేపైనా గట్టి స్క్రిప్ట్ తో వస్తాడేమో చూడాలి.
Read Also : Vaddiraju: కాంగ్రెస్ కు బలహీన వర్గాలు అంటే గౌరవం లేదు : వద్దిరాజు