AP : సోదరుడిగా అక్కాచెల్లెమ్మలను అడుగుతున్నా.. ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి – జగన్
ప్రతి నెలా ఒకటో తేదీన రూ.3వేల పెన్షన్ ఇస్తున్నాం. రూ.3వేల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం.. దేశంలో ఏపీ ఒక్కటే. రూ.2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశామని గుర్తు చేశారు
- Author : Sudheer
Date : 29-03-2024 - 9:13 IST
Published By : Hashtagu Telugu Desk
సోదరుడిగా అక్కాచెల్లెమ్మలను అడుగుతున్నా.. ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అంటూ ఎమ్మిగనూరు సభలో జగన్ (Jagan) పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం పేరుతో జగన్ బస్సు యాత్ర (BUS Yatra) చేపట్టిన సంగతి తెలిసిందే. ఈరోజు కర్నూల్ జిల్లాలో తన పర్యటన కొనసాగించారు. సాయంత్రం ఎమ్మిగనూరు (Jagan Public Meeting at Yemmiganur) లో ఏర్పటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న జగన్..ఐదేళ్ల పాలనలో తీసుకొచ్చిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ..ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు కురిపించారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దామని.. ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ సిలబస్ తీసుకొచ్చామని చెప్పుకొచ్చిన జగన్…పేదల సొంతింటి కలను నెరవేర్చాం. మహిళల రక్షణ కోసం దిశ యాప్ తీసుకొచ్చాం. ప్రతి నెలా ఒకటో తేదీన రూ.3వేల పెన్షన్ ఇస్తున్నాం. రూ.3వేల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం.. దేశంలో ఏపీ ఒక్కటే. రూ.2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశామని గుర్తు చేశారు. ఇంత మంచిచేసిన మీ ప్రభుత్వానికి రాఖీ కట్టండని కోరుతున్నానన్నారు. మే 13న కురుక్షేత్ర యుద్ధం జరుగబోతుంది. పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం జరగబోతుంది. ఈ పొత్తులను, జిత్తులను, ఈ మోసాలను, కుట్రలను వీటన్నింటిని ఎదుర్కొంటూ పేదల భవిష్యత్కు అండగా నిలిచేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అలాగే కర్నూల్ నుంచి హఫీజ్ ఖాన్కు టికెట్ ఇవ్వలేకపోయానని..కానీ ఆయనను రెండేళ్ల తర్వాత రాజ్యసభకు పంపిస్తా. నా మనసులో కల్మషం లేదు కాబట్టి లక్షల మంది సమక్షంలో ఈ మాట చెబుతున్నా. జగన్ కు, చంద్రబాబుకు మధ్య తేడా గమనించండి’ అని జగన్ వ్యాఖ్యానించారు. కాగా కర్నూల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న హఫీజ్ ఖాన్ను కాదని ఈసారి ఇంతియాజు వైసీపీ టికెట్ ఇచ్చింది. ఈ క్రమంలో జగన్ ఇలా స్పందించారు. ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్నవారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అడ్డుకున్నవారికి .. ఎస్సీలను అవమానించినవారికి రాజకీయ భవిష్యత్ లేకుండా చేయాలన్నారు. బీసీల తోకలు కత్తిరిస్తామన్నవారికి తోకలు కత్తిరించాలన్నారు. మైనార్టీల మనోభావాలను దెబ్బతీస్తున్నవారికి బుద్ది చెప్పాలని పిలుపుిచ్చారు. ఇప్పుడు కూడా దత్తపుత్రుడిని, ఢిల్లీ నుంచి మోదీని తెచ్చుకున్నాడు. చంద్రబాబు పేరు చేప్తే వెన్నుపోట్లు.. మోసాలే గుర్తుకొస్తాయన్నారు. మళ్లీ మోసం చేసేందుకు బాబు రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్నారని ఆరోపించారు.
Read Also : Pothina Mahesh : జనసేనకు పోతిన మహేష్ బై..? బై..?