Jagan Bus Yatra : జనసంద్రంగా మారిన ప్రొద్దుటూరు..
ఉదయం ఇడుపులపాయలో తన తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళ్లు అర్పించి బస్సు యాత్రను ప్రారంభించారు
- Author : Sudheer
Date : 27-03-2024 - 7:15 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రొద్దుటూరు (Proddatur ) జన సంద్రంగా మారింది…జై జగన్ ..జై జై జగన్ (Jagan) అంటూ లక్షలాది ప్రజలు మీమంతా సిద్ధం అంటూ జగన్ సభకు తరలివచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు వైసీపీ అధినేత, సీఎం జగన్ మీమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రను చేపట్టారు. ఉదయం ఇడుపులపాయలో తన తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళ్లు అర్పించి బస్సు యాత్రను ప్రారంభించారు. రోడ్ షో లో వీరన్న గట్టు పల్లె క్రాస్ వద్ద జగన్ కు గజమాలతో స్థానికులు స్వాగతం పలికారు. దారి వెంట జగన్‌పై పూలవర్షం కురిపిస్తూ , దారి పొడవునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తమ అభిమాన నాయకుడు సీఎం జగన్‌ను చూసేందుకు తండోపతండాలుగా జనం తరలివచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
కొద్దీ సేపటి క్రితం ప్రొద్దుటూరు లో సభ ప్రారంభమైంది. సభకు వచ్చిన లక్షలాది మందికి అభివాదం చేస్తూ జగన్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఎప్పటిలాగానే ప్రతిపక్ష పార్టీల ఫై విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యంగా చంద్రబాబు ఫై ..ఘాటైన వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల సమయంలోనే చంద్రబాబు కు మేనిఫెస్టో గుర్తుకు వస్తుందని..ఎన్నికల తర్వాత మేనిఫెస్టో అనేది గుర్తుకురాదని అన్నారు. వీరెవరికీ ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదని..మే 13 న జరిగే ఎన్నికల్లో ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని జగన్ పిలుపునిచ్చారు.