Jagan No Comments : అరే..జగన్ నోటి వెంట పవన్ పేరు రాలేదే?
Jagan No Comments : గతంలో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు, ముగ్గురు భార్యలు , ప్యాకేజ్ స్టార్ ఇలా ఎన్నో మాటలు అన్న జగన్..నిన్న మాత్రం సైలెంట్
- By Sudheer Published Date - 09:49 AM, Wed - 19 February 25

అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ముందు వరకు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జపం చేసిన వైస్ జగన్ (Jagan)..ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరే మరచిపోయారు. గతంలో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు, ముగ్గురు భార్యలు , ప్యాకేజ్ స్టార్ ఇలా ఎన్నో మాటలు అన్న జగన్..నిన్న మాత్రం సైలెంట్ అయ్యాడు. దీంతో పవన్ కళ్యాణ్ తో పెట్టుకుంటే ఏంజరుగుతుందో స్పష్టంగా జగన్ కు అర్థమైందని..అందుకే పవన్ పేరు పలకలేదని జనసేన శ్రేణులు అంటున్నారు.
Maoist Committee: తెలంగాణ మావోయిస్టు కమిటీపై గురి.. వాట్స్ నెక్ట్స్
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం జగన్ తన పార్టీ పరిస్థితిని సమీక్షించుకుంటూ, ప్రత్యర్థుల రాజకీయ ఎత్తుగడలను సమర్థంగా విశ్లేషిస్తున్నారు. గతంలో ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను తీవ్రంగా టార్గెట్ చేసిన జగన్, ప్రస్తుతం ఆ దిశగా వ్యూహాత్మక మార్పులు తీసుకువస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పవన్‌ను ఒంటరిగా ఉంచి, ఆయన రాజకీయ వ్యూహాలను దెబ్బతీస్తే అధికారాన్ని నిలుపుకోవచ్చనే భావనతో జగన్ ముందుకు సాగినప్పటికీ, ఆ వ్యూహం బెడిసికొట్టింది.
పవన్, చంద్రబాబు కలిసి పనిచేయడం వల్ల ఎన్నికల్లో వైసీపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. పవన్‌పై జగన్ చేసిన తీవ్రమైన ఆరోపణలు, సోషల్ మీడియా ద్వారా జరిగిన దాడులు జనసేన అధినేతకు అనుకూలంగా మారాయి. జగన్ పవన్‌ను ప్రధాన ప్రత్యర్థిగా భావించి దాడులు చేసినా, ప్రజలు పవన్‌ను ప్రత్యామ్నాయ శక్తిగా చూసేలా మారిపోయారు. దీనిని గ్రహించిన జగన్, ఎన్నికల తర్వాత తన ధోరణిని మార్చుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం జగన్ తన విమర్శలను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లపై కేంద్రీకరించి, పవన్‌పై పెద్దగా స్పందించకుండా ఉండటం గమనార్హం.
AP Budget : రూ.3 లక్షల కోట్లు దాటనున్న ఏపీ బడ్జెట్?
నిన్న మంగళవారం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కలిసిన సందర్భంలో కూడా జగన్ తన ధోరణిని మార్చుకున్నట్లు స్పష్టమైంది. విజయవాడలో జరిగిన ఈ సమావేశంలో ఆయన ప్రధానంగా చంద్రబాబు, లోకేశ్‌లపై విమర్శలు చేస్తూ, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్‌ను ప్రస్తావించలేదు. వైసీపీ సోషల్ మీడియా కూడా పవన్‌పై దాడులు తగ్గించి, వ్యూహాత్మకంగా ప్రత్యర్థులను ఎదుర్కొనే దిశగా మార్పులు తెచ్చినట్లు తెలుస్తోంది. పవన్‌ను టార్గెట్ చేయడం వల్ల కలిగే నష్టాన్ని అర్థం చేసుకున్న వైసీపీ నాయకత్వం, జగన్‌కు సూచనలు ఇచ్చినట్లు చెబుతున్నారు. చివరకు తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకుని జగన్ ఇప్పుడు చంద్రబాబు, లోకేశ్‌లను ప్రధానంగా టార్గెట్ చేస్తూ ముందుకు సాగబోతున్నట్లు తెలుస్తుంది. మరి జగన్ వ్యూహం ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.