Jagan : పగలు బీజేపీతో .. రాత్రి కాంగ్రెస్ తో రేవంత్ కాపురం -సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ..పగలు బీజేపీతో .. రాత్రి కాంగ్రెస్తో కాపురం చేస్తాడని కడపలోని పొట్టి శ్రీరాములు సర్కిల్ వద్ద నిర్వహించిన వైసీపీ ఎన్నికల సభలో అన్నారు
- Author : Sudheer
Date : 10-05-2024 - 11:38 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) ఫై ఏపీ సీఎం జగన్ (Jagan) సంచలన ఆరోపణలు చేసారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ..పగలు బీజేపీతో .. రాత్రి కాంగ్రెస్తో కాపురం చేస్తాడని కడపలోని పొట్టి శ్రీరాములు సర్కిల్ వద్ద నిర్వహించిన వైసీపీ ఎన్నికల సభలో అన్నారు. రేవంత్ రెడ్డి..పక్క చంద్రబాబు మనిషని , చంద్రబాబును గెలిపించేందుకు ఏపీలో కాంగ్రెస్ రంగప్రవేశం చేసిందని మండిపడ్డారు. రాజకీయంగా వైయస్ఆర్ కుటుంబాన్ని అణగదొక్కాలని దేశంలోని అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించిన వారితో కలిసిపోయి అదే కాంగ్రెస్, అదే టీడీపీతో కలిసిపోయి వైయస్ఆర్ అనే పేరే కనపడకుండా చేయాలనే కుట్ర జరుగుతోందన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
వివిధ పథకాలకు మీ బిడ్డ 130 సార్లు బటన్ నొక్కాడు. అక్కచెల్లెమ్మలకు నేరుగా 2 లక్షల 70 వేల కోట్లు అందించాం. ఎక్కడా లంచాలు, వివక్ష లేని పాలన అందించాం. సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందడం గతంలో చూశారా?. ఏకంగా 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన రోజులు గతంలో చూశాం. మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మర్చామని జగన్ చెప్పుకొచ్చారు.
కేవలం మూడు రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతుంది. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోవడమే. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. సాధ్యంకాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇది అర్ధం. అందరూ ఈ విషయాలను కూడా గుర్తు పెట్టుకోమని కోరుతున్నాను అంటూ జగన్ పేర్కొన్నారు.
Read Also : CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి ఈసీ నోటీసులు