CPI Narayana : ఏపీలో జగన్ ఓడిపోవడం ఖాయం – నారాయణ
- Author : Sudheer
Date : 12-12-2023 - 2:56 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో రాబోయే ఎన్నికల్లో వైసీపీ (YCP) ఓడిపోవడం ఖాయం అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana). తెలంగాణ లో ఎలాగైతే కేసీఆర్ సర్కార్ (KCR Govt) ను గద్దె దించారో..ఏపీలో కూడా ప్రజలు జగన్ గద్దె దించడం ఖాయమని..జగన్ పాలనలో అహంకారం, నియంతృత్వం పెరిగిపోయిందన్నారు. హెలికాప్టర్‌లో తిరిగితే ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని నారాయణ ప్రశ్నించారు.
We’re now on WhatsApp. Click to Join.
సీఎం పర్యటన కోసం మనుషులను నిర్బంధించడం దారుణమని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా.. పోలింగ్ జరుగుతుంటే నీటిని అడ్డంపెట్టుకుని నాగార్జునసాగర్ వద్ద జగన్ ప్రభుత్వం నాటకమాడిందని ఆరోపించారు. కేసీఆర్‌ను(KCR) గెలిపించడం కోసం ఆయన కుట్ర పన్నారని విమర్శించారు. జగన్‌మోహన్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చినంత మాత్రాన ఏమీ జరగదని..ప్రజలు ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారని..జగన్ ను ఇంటికి పంపడం గ్యారెంటీ అన్నారు. ఇక మొదటి నుండి నారాయణ..జగన్ ఫై విమర్శలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తిరుపతి మీడియా సమావేశంలో కూడా అలాగే విమర్శలు చేసి వార్తల్లో నిలిచారు.
Read Also : Free Bus Service : లేడీ గెటప్ వేసి ప్రయాణం చేస్తున్న మగవారు