Grandhi Srinivas : భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కి కీలక పోస్ట్ ఇచ్చిన జగన్..
గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు స్థానాలలో పోటీ చేయగా..అందులో ఒకటి భీమవరం. ఇక్కడ వైసీపీ నుండి గ్రంధి శ్రీనివాస్ పోటీ చేసి..పవన్ కళ్యాణ్ ఫై ఘన విజయం సాధించారు
- By Sudheer Published Date - 03:43 PM, Thu - 5 October 23

భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ (Bhimavaram MLA Grandhi Srinivas) అంటే జగన్ (CM Jagan) కు ప్రత్యేకమైన అభిమానం..ఎందుకో తెలుసా..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను ఓడించాడు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు స్థానాలలో పోటీ చేయగా..అందులో ఒకటి భీమవరం. ఇక్కడ వైసీపీ నుండి గ్రంధి శ్రీనివాస్ పోటీ చేసి..పవన్ కళ్యాణ్ ఫై ఘన విజయం సాధించారు. అప్పటి నుండి శ్రీనివాస్ ఫై జగన్ కు ఓ ప్రత్యేక అభిమానం ఉంటుంది. పవన్ కల్యాణ్ ను ఓడించిన జెయింట్ కిల్లర్ గా శ్రీనివాస్ పేరు తెచ్చుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక, ఆ మధ్య పవన్ కల్యాణ్ పై గ్రంధి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది కూడా పవన్ కల్యాణ్ తెలియట్లేదని ఎద్దేవా చేశారు. దమ్ముంటే మరోసారి భీమవరం నుంచి పోటీ చేయాలని సవాల్ సైతం చేసారు. ఇలా ప్రతిసారి పవన్ కళ్యాణ్ ఫై విమర్శలు చేస్తూ..జగన్ సృష్టిలో శ్రీనివాస్ పడుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా గ్రంధి శ్రీనివాస్ కు జగన్ కీలక పోస్ట్ (Key Post) అందజేసి ఆయనలో సంతోషం నింపారు. శాసనసభలో ప్రభుత్వ విప్ గా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ను నియమించారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి.
Read Also : Harish Rao: కేసీఆర్ పాలనలో రైతుల పిల్లలు డాక్టర్లుగా మారుతున్నారు: మంత్రి హరీశ్ రావు