HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jagan Emotional Speech In Amalapuram

AP : జగన్.. ప్రజలను ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా..?

అధికారంలోకి వస్తే తన అంతు చూస్తారని బెదిరించారన్నారు

  • Author : Sudheer Date : 12-08-2023 - 5:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Jagan Video
jagan emotional speech in amalapuram

వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్ (Jagan)..ప్రజలను ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు, ప్రతిపక్ష పార్టీలు. ఎందుకంటే శుక్రవారం అమలాపురం సభ (Amalapuram Public Meeting)లో ఈయన అలాగే మాట్లాడారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని అమలాపురం మండలం జనుపల్లిలో వరుసగా నాల్గవ ఏడాది వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 1,05,13,365 మంది డ్వాక్రా మహిళల ఖాతాల్లో సున్నావడ్డీ నగదు రూ.1,354 కోట్లను జమ చేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నిన్న ముగ్గురు ఒక్కో చోట సభలు నిర్వహించారని.. అధికారం ఇస్తే ఎవరినీ వదలరని హెచ్చరించారని జగన్ చెప్పుకొచ్చారు. అధికారంలోకి వస్తే తన అంతు చూస్తారని బెదిరించారన్నారు. ఏకంగా నరకాన్ని చూపిస్తామంటున్నరని వాయిస్ మార్చి వేరియేషన్ చూపించి మరీ ప్రసంగించారు. గిట్టని వారిని మట్టు బెడతామంటున్నారని.. అందుకే అధికారం ఇవ్వాలంటున్నారని ఆరోపించారు. ఇవన్నీ తాను అన్న మాటలు కాదని.. చంద్రబాబు దత్తపుత్రుడు, సొంత పుత్రుడు అన్నమాటలని పేర్కొన్నాడు.

ఈ మాటలు విన్న జనాలు మరో విధంగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. జగన్ లో ఓటమి భయం మొదలైందని అందుకే ఇలా ప్రజలను ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ (Emotional blackmail) చేయడం చేస్తున్నాడని వారంతా మాట్లాడుకుంటున్నారు. గతంలో ఇలాగే వైస్సార్ పేరు చెప్పి..ప్రజలను మోసం చేసి , అధికారంలో వచ్చాడని, సీఎం కుర్చీ ఎక్కగానే తన నిజ స్వరూపం చూపించాడని , సంక్షేమ పధకాల పేరు చెప్పి, ప్రజల నడ్డి విరగ్గొడుతున్నాడని, ప్రతి దానిపై పన్ను విదిస్తున్నాడని , ఆఖరికి చెత్త ఫై కూడా చెత్త పన్ను విసి చెత్త సీఎం అనిపించుకున్నాడని ప్రతిపక్షాలు , ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మొన్నటి వరకు 175 కి 175 అని చెప్పుకుంటూ వచ్చిన జగన్…ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ ఏకమై అయ్యాయని చెపుతూ ముసలి కన్నీరు కరుస్తున్నాడని అంటున్నారు.

తాను ప్రతిపక్షాలను చేసిన వేధింపులకు అధికారం కోల్పోతే.. తనకు నిలువ నీడ కూడా ఉండదన్న భయానికి ఆయన వస్తున్నారని భావిస్తున్నారు. ఇలాగే ఎమోషనల్ ఏడుపును ముందు ముందు మరింత ఎక్కువగా ప్రజల ముందు వినిపించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ సారి ఓడిపోతే తనను చంపేస్తారని.. దయచేసి గెలిపించాడని ఆయన సెంటిమెంట్ ప్రయోగించే ప్లాన్ ఐ ప్యాక్ రెడీ చేసిందని అంటున్నారు. మొత్తంగా జగన్ రెడ్డి తన పాలనపై పూర్తిగా నమ్మకం కోల్పోయారని.. చేసిన తప్పులకు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న భయంతో.. ప్రజల ముందుకు ఏడుపు మొహంతో వచ్చేందుకు మొదటి అడుగు అమలాపురంలో వేశారని అంటున్నారు. చూద్దాం జగన్ ఇలాగే సెంటిమెంట్ కొనసాగిస్తాడా..? గెలుపు ఫై ధీమాగా ఉంటాడా అనేది.

Read Also : SKN : మెగా ఫ్యాన్స్ రంగంలోకి దిగితే తట్టుకోలేరు..వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చిన బేబీ నిర్మాత


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amalapuram Public Meeting
  • AP CM Jagan
  • jagan Emotional blackmail
  • jagan emotional speech
  • Janasena
  • tdp

Related News

Pawan Lokesh Frd

ఇది కదా స్నేహమంటే !! పవన్ గురించి చెపుతూ నారా లోకేశ్ ఎమోషనల్

చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు, యావత్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళనలో ఉన్న తరుణంలో, పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి లోకేష్‌కు ధైర్యం చెప్పడం ఆ బంధాన్ని మరింత ధృడపరిచింది. "అంతా బాగున్నప్పుడు అందరూ పలకరిస్తారు, కానీ కష్టకాలంలో తోడు నిలిచేవారే నిజమైన స్నేహితులు" అని లోకేష్ పేర్కొనడం గమనార్హం.

  • Pawan is a person who thinks about two or three generations: Nagababu

    నాగబాబు కు కీలక బాధ్యతలు అప్పగించిన కూటమి సర్కార్

  • Arava Sridhar Janasena Mla

    రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై జనసేన జనసేన అధిష్టానం సీరియస్‌

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్

  • Lokesh Tdp Office

    మాట తప్పడం టీడీపీ రక్తంలోనే లేదు – నారా లోకేష్

Latest News

  • క్రికెట్ ప్ర‌పంచంలో విషాదం.. మాజీ క్రికెట‌ర్ మృతి!

  • మ‌రోసారి ధ‌నుష్‌తో జ‌త క‌ట్ట‌నున్న సాయి ప‌ల్ల‌వి!

  • అతిగా మ‌సాలా ఫుడ్ తింటున్నారా?

  • ప్ర‌ధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్‌!

  • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

Trending News

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

    • పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

    • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

    • మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd