SKN : మెగా ఫ్యాన్స్ రంగంలోకి దిగితే తట్టుకోలేరు..వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చిన బేబీ నిర్మాత
పడ్డవాళ్లు ఎప్పుడూ చెడ్డ వాళ్లు కాదు. చిరంజీవి గారిని ఏమైనా అంటే.. ఆకాశంపై ఉమ్మేసినట్టే
- By Sudheer Published Date - 08:57 PM, Fri - 11 August 23

బేబీ నిర్మాత SKN ..వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. చిరంజీవి లాంటి నోబెల్ పర్సనాలిటీని విమర్శించడం.. తిట్టడాన్ని జనం చూస్తే.. ఆయన్ని తిడుతున్నారేంటని అనుకుంటారు. పడ్డవాళ్లు ఎప్పుడూ చెడ్డ వాళ్లు కాదు. చిరంజీవి గారిని ఏమైనా అంటే.. ఆకాశంపై ఉమ్మేసినట్టే అని ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేసారు.
మెగా ఫ్యామిలీ కి అతి దగ్గరగా ఉండే వాళ్లలో SKN ఒకరు. చిరంజీవి పై అభిమానంతో చిత్రసీమలో అడుగుపెట్టిన శ్రీనివాస్ (SKN) జన్రలిస్ట్ గా..ఆ తర్వాత PRO గా ఇక ఇప్పుడు నిర్మాత గా అంచలంచలుగా ఎదుగుతూ వచ్చారు. రీసెంట్ గా బేబీ చిత్రాన్ని నిర్మించి భారీ విజయాన్ని అందుకున్నారు. దాదాపు ఈ మూవీ 75 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. మెగా ఫ్యామిలీ అంటే పడిచచ్చే SKN ..ఈ మధ్య వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ పై అంటున్న మాటల పై అప్పుడప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. రీసెంట్ గా చిరంజీవి పై వైసీపీ నేతలు చేసిన కామెంట్స్ పై SKN స్పందించారు.
పవన్ కళ్యాణ్‌ని దత్తపుత్రుడు అని.. ప్యాకేజీ స్టార్ అని.. వీకెండ్ స్టార్ అని అన్నప్పుడు ఆయన అభిమానిగా మాకు ఎంతో బాధ కలుగుతుంది. వాటన్నింటికీ ఆన్సర్ జనం ఇస్తారు. వ్యక్తిగతంగా ఆయన్ని విమర్శిస్తున్నారు. విధాలను ప్రశ్నిస్తూ విమర్శలు ఉండాలి. ఇప్పుడు వినకూడని భాషతో విమర్శలు చేస్తున్నారు. సభ్యత సంస్కారం మర్చిపోతున్నారు. ఎవర్ని ఎవరు ఎలా విమర్శిస్తున్నారో జనం చూస్తున్నారు. కేవలం పవన్ కళ్యాణ్ గారినే కాదు చిరంజీవి గారిని కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. విమర్శిస్తే విమర్శించవచ్చు. ఫ్యాన్స్ అనేవాళ్లు రంగంలోకి దిగితే ఇంకా చెత్తగా మాట్లాడగలరు. కానీ దిగట్లేదు. సభ్యత పాటిస్తున్నాం’ అని వైసీపీ నేతలకు SKN స్మాల్ వార్నింగ్ ఇచ్చారు.
Read Also : Coconut chicken curry: ఎంతో రుచిగా ఉండే కోకోనట్ చికెన్ కర్రీ తయారీ విధానం?