HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jagan Election Campaign Starts On March 16

Jagan Election Campaign : ఈ నెల 16 నుండి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం..

  • Author : Sudheer Date : 09-03-2024 - 7:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Jagan Nomination
Cm Jagan (1)

వైసీపీ అధినేత , సీఎం జగన్ (Jagan) తన స్పీడ్ ను ఇంకాస్త పెంచబోతున్నాడు. ప్రతిపక్ష పార్టీలన్నీ కలవడంతో తన వ్యూహాన్ని మార్చేపనిలో పడ్డారు. ఇప్పటికే సిద్దం సభల ద్వారా ఎన్నికల సమరశంఖం పూరించారు. చంద్రబాబు తో అందరూ ఓడాల్సిందేనని నినదించారు. ప్రతీ సీటు గెలవాల్సిందేనని పిలుపునిచ్చారు. తాము అమలు చేసిన సంక్షేమం – సామాజిక న్యాయం తమను గెలిపిస్తుందనే ధీమాతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇదే సమయంలో ప్రజలపై కొత్త వరాల ప్రకటించబోతున్నారు. నిన్నటి వరకు సిద్ధం అంటూ వారంలో ఓ సారి ప్రజల్లోకి వెళ్లిన జగన్..ఇక ఈ నెల 16 నుండి పూర్తిగా ప్రతి రోజు ప్రజల ముందుకు వెళ్లేందుకు డిసైడ్ అయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈనెల 16 నుంచి జగన్ ఎన్నికల ప్రచారం (Jagan Election Campaign) ప్రారభించబోతున్నారు. 26 జిల్లాల్లో రోడ్ షోలు, సభల్లో పాల్గొననున్నారు. రోజుకు కనీసం 3 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఉత్తరాంధ్ర నుంచి ప్రచార కార్యక్రమం ప్రారంభం కానుంది. చివరి దశ ప్రచారంలో భాగంగా ఆయన రోజుకు 4 నియోజకవర్గాల్లో పర్యటిస్తారని సమాచారం. దీనికి సంబదించిన పూర్తి షెడ్యూల్ ను సిద్ధం చేసే పనిలో అధిష్టానం ఉంది. ఇదిలా ఉంటె ఈ నెల 11 న వైయ‌స్ఆర్ జిల్లాలో జగన్ ప‌ర్య‌టించ‌నున్నారు. పులివెందుల‌లో ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను సీఎం ప్రారంభించ‌నున్నారు.

సోమ‌వారం ఉదయం 9.00 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి జ‌గ‌న్ బయలుదేరి పులివెందుల చేరుకుంటారు. ముందుగా డాక్టర్ వైయ‌స్ఆర్‌ గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ ప్రారంభిస్తారు. తర్వాత బనాన ఇంటిగ్రేటెడ్‌ ప్యాక్‌ హౌస్‌ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్‌ వైయ‌స్ఆర్‌ మినీ సెక్రటేరియట్‌ కాంప్లెక్‌కు చేరుకుని ప్రారంభిస్తారు. అనంతరం డాక్టర్‌ వైయ‌స్ఆర్‌ జంక్షన్‌కు చేరుకుని ముఖ్య‌మంత్రి ప్రారంభిస్తారు. అక్కడే సెంట్రల్‌ బౌల్‌ వార్డ్‌ ప్రారంభించిన తర్వాత వైయ‌స్‌ జయమ్మ షాపింగ్‌ కాంప్లెక్స్‌కు చేరుకుని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి గాంధీ జంక్షన్‌కు చేరుకుని ప్రారంభించిన అనంతరం డాక్టర్‌ వైయ‌స్ఆర్‌ ఉలిమెల్ల లేక్‌ ఫ్రంట్‌ వద్దకు చేరుకుని ప్రారంభిస్తారు. తర్వాత ఆదిత్యా బిర్లా యూనిట్‌కు చేరుకుని ఫేజ్‌ 1 ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి సంయూ గ్లాస్‌ వద్దకు చేరుకుని, అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఇడుపులపాయ చేరుకుంటారు. వైయ‌స్ఆర్ మెమోరియల్‌ పార్కు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం వైయ‌స్ఆర్‌ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు, అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు.

Read Also :  AP Politics : జనసేన నుంచి బీజేపీకి సీటు.. ఇది అన్యాయమే..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • AP 2024 Elections
  • jagan
  • Jagan Election campaign

Related News

Electricity demand in Andhra Pradesh to double in ten years: Experts warn against grid expansion

AP Electricity : ఏపీలో రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం

సాధారణంగా ఏప్రిల్ మరియు మే నెలల్లో ఉండాల్సిన గరిష్ఠ విద్యుత్ డిమాండ్, ఈ ఏడాది మార్చి నెలలోనే రికార్డు స్థాయికి చేరుకోవడం గమనార్హం

  • Good News For Unemployed

    IT Park : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ..విశాఖ లో మరో IT పార్క్.. 30వేల జాబ్స్!

  • gas cylinder

    Gas Shortage : గ్యాస్ ధరల పెంపు పై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..!!

  • Jada Sravan

    Jada Sravan Kumar : జడ శ్రవణ్ కు సంబంధించి మరో మోసం బట్టబయలు

  • Jagan

    వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

Latest News

  • LPG Shortage : ఐటీ క్యాంటిన్ మూసేస్తున్నాం.. వర్క్ ఫ్రం హోం తీసుకోండి

  • Fire Accident : SCB మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి

  • పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు

  • టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ వీడియో రిలీజ్

  • శుభమన్ గిల్, హర్షిత్ రాణాకు బీసీసీఐ బెస్ట్ క్రికెటర్ అవార్డు!

Trending News

    • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    • ఇకపై వీరికి ఎల్‌పిజి సిలిండర్లు లభించవు!

    • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd