Vizag Fishing Harbour : మత్స్యకారులకు భారీ సాయాన్ని ప్రకటించిన జగన్..
ఈ అగ్ని ప్రమాద ఘటనలో నష్టపోయిన వారికీ దాదాపు 80 శాతం సాయాన్నిఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది
- Author : Sudheer
Date : 20-11-2023 - 6:53 IST
Published By : Hashtagu Telugu Desk
ఆదివారం అర్ధరాత్రి విశాఖ ఫిషింగ్ హార్బర్ (Vizag Fishing Harbour)లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident)చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సుమారు 40 కి పైగా మరబోట్లు (Boats) కాళీ బూడిదయ్యాయి. ఈ అగ్నిప్రమాదంలో సుమారు 30 కోట్ల రూపాయల వరకు మత్స్యకారులకు నష్టం వాటిల్లింది. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేయగా..జగన్ ప్రభుత్వం వారికీ సాయం (Jagan Compensation for Vizag Fishing Harbour Victims) చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ అగ్ని ప్రమాద ఘటనలో నష్టపోయిన వారికీ దాదాపు 80 శాతం సాయాన్నిఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
ఇక అగ్ని ప్రమాదంపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాత్రి ఫిషింగ్ హార్బర్ లో ఓ యూట్యూబర్ మద్యం పార్టీ ఏర్పాటు చేసి, మద్యం మత్తులో ఘర్షణ పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బోటుకు నిప్పు పెట్టినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న సదరు యూట్యూబర్, అతని స్నేహితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఈ ప్రమాదం ఫై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. ఫిషింగ్ హార్బర్‌లో అర్థరాత్రి చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో 40 బోట్లు దగ్ధం కావడం దురదృష్టకరమన్నారు. ఈ ప్రమాదం వల్ల నష్టపోయిన బోట్ల యజమానులను అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వీటిపై ఆధారపడ్డ మత్స్యకారులకు జీవన భృతి అందించాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై విచారణ చేపట్టాలని.. భద్రతాపరమైన అంశాలపై సమీక్షించి, పటిష్ట చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
Read Also : Shakib Al Hasan : రాజకీయాల్లోకి బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్