HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >India Test Fires Ins Arighat Takes A Big Step Towards Nuclear Deterrence

INS Arighat : విశాఖ తీరంలో ‘ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌’ నుంచి తొలి మిస్సైల్ టెస్ట్

3,500 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించే కెపాసిటీ ‘కే4’(INS Arighat) బాలిస్టిక్ క్షిపణికి ఉంది.

  • Author : Pasha Date : 28-11-2024 - 1:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nuclear Missile
Nuclear Missile

INS Arighat : పొరుగుదేశం చైనాలోని అన్ని ప్రధాన నగరాలను కవర్ చేసేంత కెపాసిటీ కలిగిన ‘కే4’ బాలిస్టిక్ క్షిపణిని భారత్ పరీక్షించింది. ప్రత్యేకత ఏమిటంటే.. ఈ లాంగ్ రేంజ్ మిస్సైల్‌ను తొలిసారిగా ‘ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌’ అనే అణు జలాంతర్గామి నుంచి ప్రయోగించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సముద్ర తీరంలో భారత నౌకాదళం ఈ ప్రయోగ పరీక్ష నిర్వహించింది. 3,500 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించే కెపాసిటీ ‘కే4’(INS Arighat) బాలిస్టిక్ క్షిపణికి ఉంది. ప్రస్తుతం భారత నౌకాదళం, రక్షణ రంగ విభాగాలు ఈ ప్రయోగం ఫలితాలను నిశితంగా విశ్లేషిస్తున్నారు. మిస్సైల్ ఎంత దూరం ప్రయాణించింది ? ఎంత వేగంతో ప్రయాణించింది ?  నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుందా ? అనే అంశాలను బేరీజు వేసే ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. తదుపరిగా దీనిపై రక్షణ శాఖ నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Also Read :Delhi Blast : ఢిల్లీలో అలజడి.. పీవీఆర్ మల్టీప్లెక్స్ సమీపంలో భారీ పేలుడు

ఏమిటీ ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌ ?

ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌.. ఒక అణు జలాంతర్గామి. ఇది అణుశక్తితో పనిచేయగలదు. దీని నుంచి ఏకంగా  బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించవచ్చు. ఈ తరహా కెపాసిటీ కలిగిన  అణు జలాంతర్గాములు ప్రస్తుతం అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్‌, చైనా వద్ద మాత్రమే ఉన్నాయి. ఈ లిస్టులో ఆరో దేశంగా ఇండియా చేరింది. ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌ నుంచి  కె-15, కె-4 రకాలకు చెందిన బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించాలని భారత్ నిర్ణయించింది. ఈ మిస్సైళ్లు మన దేశంలో తయారవుతాయి. ఇవి గరిష్ఠంగా 3,500 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను కూడా ధ్వంసం చేయగలవు.  చైనాలోని ప్రధాన నగరాలను దృష్టిలో పెట్టుకొని ఈ మిస్సైళ్లను భారత్ రెడీ చేసింది.

Also Read :Rs 7300 Crore Fine : ఎనిమిది కార్ల కంపెనీలపై రూ.7,300 కోట్ల పెనాల్టీ.. ఎందుకు ?

ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌ అణు జలాంతర్గామిని మన విశాఖపట్నంలోని నేవల్‌ డాక్‌యార్డులో ఉన్న ‘షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌’లో నిర్మించారు. 2011 డిసెంబరు నుంచి కొన్నేళ్ల పాటు దీని నిర్మాణ ప్రక్రియ కొనసాగింది. ఎట్టకేలకు  2017 నవంబరు 19న ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌ను జలప్రవేశం చేయించారు. తదుపరిగా దాని పనితీరును టెస్ట్ చేస్తూ.. అంతర్గత విభాగాల పరికరాల బిగింపు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాడార్‌ వ్యవస్థ ఏర్పాటు వంటివన్నీ చేశారు.  చివరగా ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌‌లోని ఆయుధాలను తీసుకెళ్లే కెపాసిటీకి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు. రెండు నెలల కిందటే దీన్ని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ జాతికి అంకితం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • china
  • india
  • INS Arighaat
  • INS Arighat
  • long range ballistic missile
  • Nuclear Deterrence
  • nuclear powered submarine

Related News

20 US States On Alert As Venomous Chinese Ant

Chinese Ant: అమెరికాలో చైనా చీమలు కుడితే ప్రాణాపాయం..

అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న చైనాకు చెందిన ‘ఏషియన్ నీడిల్ ఆంట్’ అనే ప్రమాదకరమైన చీమల జాతి గురించి ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చైనా మూలాలు కలిగిన ఈ ‘ఏషియన్ నీడిల్ ఆంట్స్’ ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్, ఫ్లోరిడా, న్యూయార్క్, పెన్సిల్వేనియా సహా సుమారు 20 రాష్ట్రాలకు విస్తరించాయి. ఐదో వంతు అంగుళం పరిమాణంలో, ముదురు గోధుమ లేదా నలుపు రంగులో ఉండే ఈ

    Latest News

    • హైదరాబాద్‌లో నీటి కష్టాలు.. వాటర్‌ ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్‌

    • Chiranjeevi: మెగాస్టార్ న్యూ లుక్ వైరల్

    • NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో షాక్ ఆయన సీబీఐ..

    • Donald Trump: డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన

    • హైదరాబాద్‌లో మరో నేపాలీ గ్యాంగ్.. భారీ దోపిడీ

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd