AP Govt: పెరుగుతున్న కోవిడ్ కేసులు.. ఏపీ ప్రభుత్వం అలర్ట్
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.
- By Balu J Published Date - 02:02 PM, Tue - 19 December 23
AP Govt: దేశవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి అప్రమత్తమైంది. కేంద్రం సూచనలతో ముందస్తు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. సీజనల్‌గా ఇప్పటికే రెగ్యులర్‌గా ఫీవర్సర్వేను వైద్య ఆరోగ్యశాఖ నిర్వహిస్తోంది. రాష్ట్రంలో కోవిడ్ సన్నద్ధతపై ఉన్నతాధికారులతో వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎంటీ కృష్ణబాబు సమీక్షించారు.
గ్రామస్థాయిలో ర్యాపిడ్ కిట్లతో పాటు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్ విషయంతో అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రం రాష్ట్రాలకి హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రాష్డ్రాలకి కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి సుదాన్ష్ పంత్ లేఖ రాశారు. కేరళలో వెలుగుజూసిన కోవిడ్ కొత్త సబ్ వేరియంట్ జెఎన్1పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also Read: China Earthquake: 116కి చేరిన మృతుల సంఖ్య