TTD: జనవరిలో 21.09 లక్షల మంది భక్తుల దర్శనం, తిరుమల శ్రీవారికి రూ.116.46 కోట్లు ఆదాయం
- By Balu J Published Date - 06:46 PM, Fri - 2 February 24

TTD: జనవరి నెలలో తిరుమల శ్రీవారిని 21.09 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. హుండీ కానుకల ద్వారా రూ.116.46 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. హిందూయేతర భక్తులకు ఆఫ్‌లైన్‌లో శ్రీవారి సేవకు నమోదు చేసుకునే అవకాశం త్వరలో కల్పిస్తామని ఈవో ధర్మారెడ్డి అన్నారు. శ్రీవారి దర్శనానికి భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
కాంప్లెక్స్, క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండకుండా టైమ్ స్లాట్ విధానాన్ని మరింత పెంచాలని యోచన ఉన్నట్లు చెప్పారు. తిరుమలలో ప్రైవేటు ఆహార విక్రయ కేంద్రాల్లో ఎల్పీజీ గ్యాస్ స్టవ్‌లు క్రమంగా నియంత్రిస్తామని ఆయన అన్నారు. త్వరలో ఎల్‌ఎన్‌జీ స్టేషన్‌ను ఏర్పాటు చేసి పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేస్తాంమని ఈవో ధర్మారెడ్డి అన్నారు. అగ్నిప్రమాదాలను నివారించేందుకే ఎల్పీజీ సిలిండర్ల స్థానంలో ఎల్‌ఎన్‌జీ పైపులైన్ త్వరలో తీసుకొస్తామని అన్నారు. మాడ వీధుల్లో ఉండే భక్తులకు పాలు, అల్పాహారం పంపిణీకి చర్యలు తీసుకుంటామని ఈవో ధర్మారెడ్డి అన్నారు.
Also Read: Sankarabharanam: 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న “ శంకరాభరణం “