AP : కడపలో కౌంటింగ్ రోజున 144 సెక్షన్ అమలు: డీఎస్పీ షరీఫ్
- By Latha Suma Published Date - 01:25 PM, Wed - 29 May 24

144 Section: ఏపి(AP)లో ఎన్నికల ఫలితాల కౌంటింగ్(Election Counting) సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కడప జిల్లా(Kadapa District) డీఎస్పీ షరీఫ్(DSP Sharif) మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మాట్లాడుతూ..పోలింగ్ సమయంలో రాష్ట్రంలో జరిగినటువంటి ఘటనలు కౌంటింగ్ రోజున జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా మొత్తం 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. మౌలానా అబుల్ కలాం ఉర్దూ యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రం వద్ద నాలుగు అంచెల భద్రత ఏర్పాటు చేస్తామన్న డీఎస్పీ.. జూన్ 3వ తేదీ నుంచి పార్టీ కార్యాలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని వివరించారు.
We’re now on WhatsApp. Click to Join.
జూన్ 3వ తేదీ మధ్యాహ్నం నుంచి కడప(Kadapa)లో ఇతర జిల్లాల వ్యక్తులు ఉండకూడదని షరీఫ్ స్పష్టం చేశారు. 4వ తేదీ కడపలో ఆర్టీసి బస్సులను తిరగనివ్వమని వెల్లడించారు. కడప నగరం నాలుగు సరిహద్దు ప్రాంతాల్లోనే బస్సులు నిలిపివేస్తామని.. ప్రయాణికులు 8 కిలోమీటర్ల దూరం వెళ్లి బస్సులు ఎక్కాల్సిందేనని చెప్పారు. ఈసీ నిబంధనల మేరకే కడప నగరంలోకి బస్సులు తిప్పట్లేదని డీఎస్పీ స్పష్టం చేశారు.
Read Also: Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు షాక్.. బెయిల్ పొడిగింపు పిటిషన్ తిరస్కరణ
కాగా, కౌంటింగ్(Counting) మొదలైన నాలుగు గంటల్లో తొలి ఫలితం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో కౌంటింగ్ ఏర్పాట్లు దాదాపు పూర్తికావొచ్చాయి.