C-Vigil App : ‘సీ-విజిల్’ యాప్.. ఎన్నికల అక్రమాలపై మీరూ కంప్లయింట్ చేయొచ్చు
C-Vigil App : ఎన్నికల వేళ జరిగే అవకతవకలు, అక్రమాలను సామాన్య పౌరులు కూడా బయటపెట్టొచ్చు.
- By Pasha Published Date - 05:30 PM, Tue - 19 March 24

C-Vigil App : ఎన్నికల వేళ జరిగే అవకతవకలు, అక్రమాలను సామాన్య పౌరులు కూడా బయటపెట్టొచ్చు. వాటిని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లొచ్చు. ఎక్కడైనా అధికార దుర్వినియోగం కానీ, డబ్బుల పంపిణీ కానీ జరిగినా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లొచ్చు. ఎలా ? అని అనుకుంటున్నారా !! మరేం లేదు.. కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన ‘సీ విజిల్’ (C-vigil) యాప్ ద్వారా ఇలాంటి అంశాలపై అధికారులకు ఫిర్యాదులను పంపొచ్చు. అక్రమాలను వెలుగులోకి తేవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘సీ విజిల్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీన్ని ఫోన్ నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.
We’re now on WhatsApp. Click to Join
ఫొటో, వీడియో, ఆడియో..ఏదైనా ఒకటి చాలు
- ‘సీ విజిల్’ యాప్(C-Vigil App) ద్వారా ఫిర్యాదు చేయాలంటే సరైన సాక్ష్యాధారాలు ఉండాలి. ఎన్నికల అక్రమాలకు సంబంధించిన ఫొటో లేదా వీడియో లేదా ఆడియో ఫైల్స్‌ను ఈ యాప్‌లో అప్‌లోడ్ చేయాలి.
- యాప్‌లో ఫొటో గానీ, వీడియోగానీ అప్‌లోడ్ చేసిన వెంటనే మన లొకేషన్ వస్తుంది. అక్కడ మిగిలిన వివరాలన్నీ క్షుప్తంగా నమోదు చేయాలి.
- యాప్‌లో వివరాలు పొందుపరిచిన ఐదు నిమిషాల్లోనే జిల్లా ఎన్నికల అధికారికి ఈ ఆధారాలు పంపుతారు.
- వారు 15 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకుంటారు. అక్కడ ప్రజలను విచారించి అరగంటలోనే వివరాలు సేకరించి ఎన్నికల అధికారికి నివేదిస్తారు.
- వెంటనే దానిపై గంటలోపే చర్యలు తీసుకుంటారు.
- మొత్తం విచారణ ప్రక్రియ వంద నిమిషాల్లోనే ముగిసిపోతుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.
- సి విజిల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులకు అధిక ప్రధాన్యమివ్వాలని అధికారులను ఆదేశించారు.
- మనం ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు ఎంతవరకు వచ్చాయన్న దాన్ని స్టేటస్ కూడా తెలుసుకునే వెసులుబాటు కల్పించారు.
- దీన్ని పౌరులు ఎవరైనా వినియోగించవచ్చు.
- పార్టీలకు అతీతంగా ఎవరు అవినీతికి పాల్పడినా ఈ యాప్‌లో ఫిర్యాదు చేయొచ్చు.
Also Read :Sita Soren : బీజేపీలోకి హేమంత్ సోరెన్ వదిన.. ఎందుకో తెలుసా ?
ఎన్నికల్లో డబ్బులు ఖర్చుపెట్టి గద్దెనెక్కుదామనుకునే రాజకీయ నాయకులకు సీ-విజిల్ యాప్ చెక్‌పెట్టనుంది. మంచి ప్రజానాయకుడిని ఎన్నుకోవడం ఎంత అవసరమో.. అక్రమార్కులకు ఆదిలోనే అడ్డుకట్ట వేయడం అంతే అవసరం. కేవలం డబ్బుతోనే విజయం సాధించవచ్చనుకునే వాళ్లను ఈ యాప్ భరతం పట్టనుంది. ప్రజలంతా ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఎన్నికల అక్రమాలపై తక్షణం ఫిర్యాదు చేయాల్సిందిగా ఎన్నికల సంఘం పిలుపునిచ్చింది.